వీడియో: చిరుత వేగం.. ధోనీ సొంతం: 300 ల్యాండ్ మార్క్- అదేంటో తెలుసా..?!

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విరుచుకుపడుతోంది. ఓవర్‌కు 10 పరుగులు చొప్పున సాధిస్తోంది. 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్ ఆరంభించింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని ఇచ్చారు. ప్రారంభ ఓవర్లల్లో వారిద్దరూ ధాటిగా ఆడారు. చెన్నై బౌలర్లను దడదడలాడించారు.

 IPL 2023 Final

ఈ సీజన్‌లో మూడు సెంచరీలను అలవోకగా ఊది అవతల పడేసిన శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో కూడా ప్రతాపం చూపాడు గానీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో ఏడు బుల్లెట్ల వంటి ఫోర్లు ఉన్నాయి. 195 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడీ డాషింగ్ ఓపెనర్. జట్టు స్కోర్ 67 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు.

ఏడో ఓవర్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టంపవుట్‌గా వెనుదిరిగాడు గిల్. అవుట్‌ సైడ్ ఆఫ్ దిశగా రవీంద్ర జడేజా సంధించిన ఫ్లాటర్‌ను షాట్ ఆడబోయి క్రీజ్ నుంచి బయటికొచ్చాడు శుభ్‌మన్ గిల్. టైమింగ్ మిస్ అయ్యాడు. మెలికలు తిరుగుతూ నేరుగా వికెట్ కీపర్ ధోనీ చేతుల్లో వాలిందా బంతి. అంతే.. సెకెన్ల వ్యవధిలో బెయిల్స్‌ను ఎగురగొట్టాడు ధోనీ. ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు జడేజా తెరదించాడు.

గిల్‌ను అవుట్ చేయడం ద్వారా సరికొత్త రికార్డును సృష్టించాడు ధోనీ. టీ20 మ్యాచ్‌లల్లో 300 సార్లు బ్యాటర్లను అవుట్ చేసిన ఘనతను అందుకున్నాడు. ధోనీ 300 వికెట్‌.. శుభ్‌మన్ గిల్‌దే. ఇది అతని 250వ ఐపీఎల్ మ్యాచ్ కూడా కావడం కోఇన్సిడెన్స్. వికెట్ల వెనుక చిరుతలా కదులుతాడనే పేరుంది ధోనీకి. దాన్ని నిలబెట్టుకున్నాడు ధోనీ. మెరుపువేగంతో గిల్‌ను పెవిలియన్ పంపించాడు.

బెయిల్స్‌ను గాల్లోకి ఎగరగొట్టిన తరువాత ఇక మళ్లీ వెను దిరిగి కూడా చూసుకోలేదు ధోనీ. గిల్‌ను అవుట్ అయ్యాడనే కాన్ఫిడెంట్ అలాంటిది మరి. రవీంద్ర జడేజా సంధించిన ఫ్లాటర్‌ను షాట్ ఆడటానికి క్రీజ్‌లో నుంచి గిల్ బయటికి రావడం, ఆ బంతిని ఆడటం మిస్ కావడం, దాన్ని అందుకున్న వెంటనే ధోనీ బెయిల్స్‌ను లేపేయడం క్షణాల్లో జరిగిపోయింది. ఫాస్టెస్ట్ స్టంపౌట్‌గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+