బట్లర్.. బలాదూర్- శుభ్‌మన్ గిల్ నయా రికార్డ్..!!
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విరుచుకుపడుతోంది. ఎనిమిదికి పైగా రన్‌రేట్‌తో పరుగులు పెడుతోంది స్కోర్ బోర్డ్. గుజరాత్ బ్యాటర్ల విన్యాసాలు చూస్తోంటే భారీ స్కోర్ ఖాయమనిపించేలా ఉంది.
సరిగ్గా 7 గంటలకు టాస్ పడింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్ ఆరంభించింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని ఇచ్చారు. ప్రారంభ ఓవర్లల్లో వారిద్దరూ ధాటిగా ఆడారు. చెన్నై బౌలర్లను దడదడలాడించారు. తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ స్కోర్.. వికెట్ నష్టానికి 80 పరుగులు.

ఈ సీజన్‌లో మూడు సెంచరీలను అలవోకగా ఊది అవతల పడేసిన శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో కూడా ప్రతాపం చూపాడు గానీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో ఏడు బుల్లెట్ల వంటి ఫోర్లు ఉన్నాయి. 195 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడీ డాషింగ్ ఓపెనర్. జట్టు స్కోర్ 67 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు.
ఏడో ఓవర్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టంపవుట్‌గా వెనుదిరిగాడు గిల్. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా రవీంద్ర జడేజా సంధించిన ఫ్లాటర్‌ను షాట్ ఆడబోయి క్రీజ్ నుంచి బయటికొచ్చాడు శుభ్‌మన్ గిల్. టైమింగ్ మిస్ అయ్యాడు. మెలికలు తిరుగుతూ నేరుగా వికెట్ కీపర్ ధోనీ చేతుల్లో వాలిందా బంతి. అంతే.. సెకెన్ల వ్యవధిలో బెయిల్స్‌ను ఎగురగొట్టాడు ధోనీ. ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు జడేజా తెరదించాడు.
ఈ ఐపీఎల్ సీజన్- శుభ్‌మన్ గిల్‌దే. లీగ్ మ్యాచ్‌లల్లో రెండు సెంచరీలు అందుకున్నాడు. బ్యాక్ అండ్ బ్యాక్ సెంచరీలు బాదడం అంటే మాటలు కాదు. రెండో క్వాలిఫయర్‌లోనూ అలవోకగా వంద పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 16 మ్యాచ్‌లల్లో మూడు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు చేశాడు. గిల్ అత్యధిక వ్యక్తిగత పరుగులు 129. బ్యాటింగ్ యావరేజ్ 37.70. స్ట్రైక్ రేట్ 134.07.
ఈ సీజన్‌లో 890 పరుగులు చేశాడీ డాషింగ్ ఓపెనర్. సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. ఇదివరకు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ మీద ఉండేది ఈ రికార్డ్. 2022 ఐపీఎల్ సీజన్‌లో జోస్ బట్లర్ 863 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీన్ని దాటేశాడు శుభ్‌మన్ గిల్.
కాగా- మొదటి స్థానంలో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్నింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో నాలుగు సెంచరీల బాదాడు కోహ్లీ. ఏడు అర్ధసెంచరీలను అందుకున్నాడు. ఏడు సంవత్సరాలుగా ఈ రికార్డ్ చెక్కు చెదరట్లేదు. దీని దరిదాపులకు కూడా ఏ బ్యాటర్ వెళ్లలేకపోతున్నాడు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications