Sunrisers Hyderabad: కొత్త టీమ్..కొత్త కెప్టెన్‌తో కావ్యా పాప మ్యాజిక్ చేస్తుందా..?
హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్.2012లో డెక్కన్ ఛార్జర్స్ స్థానంలో వచ్చిన ఐపీఎల్ టీమ్. సన్ గ్రూప్ అధినేత కలానిధి మారన్ ఈ జట్టు ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నాడు. అయితే తొలిసారిగా 2013లో ఐపీఎల్ బరిలోకి సన్‌రైజర్స్ జట్టు దిగింది.2016లో టైటిల్ సొంతం చేసుకుంది.అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు స్థిరత్వం కలిగిన జట్టుగా పేరుంది. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్లలో అభిమానులను నిరాశపర్చింది. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా క్వాలిఫై కాలేకపోయింది.దీంతో ఈసారి కొత్త జట్టుతో బరిలోకి దిగుతోంది ఆరెంజ్ ఆర్మీ.
కొత్త టీమ్‌తో సన్‌రైజర్స్ జట్టు
2023 ఏప్రిల్ 2వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో సన్‌రైజర్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీని ప్రారంభిస్తుంది.సన్‌రైజర్స్ జట్టుకు హోంగ్రౌండ్‌గా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది. ఐపీఎల్ 2023లో దాదాపుగా కొత్త టీంతో బరిలో దిగుతోన్న సన్‌రైజర్స్‌కు పలువురు సౌతాఫ్రికా ప్లేయర్లు తొలి మ్యాచ్‌కు దూరం కానున్నారు. వీరిలో కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్, మార్కో జాన్‌సేన్, హెన్రిచ్ క్లాసేన్‌లు ఉన్నారు. వీరంతా ఆ సమయంలో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడుతుంటారు. ఇక సన్‌రైజర్స్ జట్టు బలబలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్- అభిషేక్ శర్మ
ఐపీఎల్ 2023లో ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లుగా కుడి ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ ఉంటారని అంచనా. దీంతో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలు బ్యాటింగ్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ జట్టు రూ.8.25 కోట్లు పోసి కొనుగోలు చేయడంతో భారీ అంచనాలు ఈ బ్యాట్స్‌మెన్‌పై ఉన్నాయి. ఇక అభిషేక్ శర్మ తన స్టైలిష్ బ్యాటింగ్‌తో తానేంటో గత రెండు సీజన్లుగా రుజువు చేసుకున్నాడు.

మిడిల్ ఆర్డర్‌లో ఎవరు...?
సన్‌రైజర్స్ జట్టులో మిడిల్ ఆర్డర్ కాస్త బలంగా ఉందనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఫామ్‌లో ఉన్న టీ20 క్రికెటర్లలో రాహుల్ త్రిపాఠీ కూడా ఒకడు.ఇక కెప్టెన్ మార్క్రమ్ సౌతాఫ్రికా 20 లీగ్‌లో అద్భుతమైన ఆటతీరు కనబర్చి సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ జట్టు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హారీ బ్రూక్ కోసం భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేసింది.ఇందుకోసం సన్‌రైజర్స్ యాజమాన్యం పర్స్‌లోని రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది.
లోవర్ ఆర్డర్లో ఎవరు..?
ఇక వాషింగ్టన్ సుందర్ సన్‌రైజర్స్ జట్టుకు మంచి బలమనే చెప్పాలి. గతంలో కూడా వాషింగ్టన్ సుందర్ తన స్పిన్‌తో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతాలు సృష్టించాడు.ఇక ఈ మధ్యే ముగిసిన సౌతాఫ్రికా 20 లీగ్‌లో హెన్‌రిచ్ క్లాసేన్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచాడు. మొత్తం 10 మ్యాచుల్లో 363 పరుగులు చేశాడు.
బౌలింగ్ డిపార్ట్‌మెంట్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ అన్ని జట్లకన్నా బలంగా కనిపిస్తోంది.గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ చాలా బలోపేతంగా ఉంది.ఉమ్రాన్ మాలిక్ గతేడాది ఐపీఎల్ 2022 ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. దీంతో ఏకంగా టీమిండియాలోనే చోటు సంపాదించుకున్నాడు.ఇక అదిల్ రషీద్ అనుభవం కూడా తోడైతే సన్‌రైజర్స్‌కు ఒక అస్త్రం దొరికందనే చెప్పాలి.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications