బాత్‌రూమ్ శుభ్రం చేసినా దుర్వాసన పోవటం లేదా? అయితే ఈ టిప్స్ ట్రై చెయ్యండి
చాలామంది టాయిలెట్ లను ఎన్నిసార్లు కడిగినప్పటికీ, బాత్ రూమ్ లలో పరిశుభ్రత ఉన్నప్పటికీ బాత్ రూమ్ నుండి దుర్వాసన వస్తుందని తెగ బాధ పడుతూ ఉంటారు. వెంటిలేషన్ లేకపోవడం వల్ల, ముఖ్యంగా వర్షాకాలం వంటి సీజన్లో బాత్ రూమ్స్ తడిగా ఉండటం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని, దీనికి పరిష్కారం ఏమిటి అని తెగ మదనపడుతూ ఉంటారు.
టాయిలెట్ పరిశుభ్రంగా ఉన్నప్పటికీ దుర్వాసన వస్తుంటే ఆ దుర్వాసన తొలగించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాలి. టాయిలెట్ నుండి దుర్వాసన వస్తుంటే ఆ వాసనను వదిలించుకోవడానికి బేకింగ్ సోడాను ఒక గిన్నెలో పోసి దానికి ఒక టీస్పూన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి, ఈ మిశ్రమాన్ని ఏదైనా కట్టె సహాయంతో బాగా కలిపి అన్ని టాయిలెట్లలో గోడలకు బాత్రూమ్ అంతటా పోసి ఓ గంట సేపు నాననిచ్చి తర్వాత నీటితో శుభ్రం చేయాలి.

వారానికి రెండుసార్లు ఇలా శుభ్రం చేస్తే టాయిలెట్స్ దుర్వాసన రాకుండా ఉంటాయి. అంతేకాదు ఒక బకెట్ నీళ్ళలో సుమారు ఒక గ్లాసు వెనిగర్ ను కలిపి బాత్రూమ్ శుభ్రం చేసిన తర్వాత వెనిగర్ కలిపిన నీళ్లను బాత్రూంలో పోసి సుమారు గంట సేపు నాననివ్వండి. ఆపై బాత్రూంను మళ్లీ నీటితో శుభ్రం చేస్తే వాసన రాకుండా ఉంటుంది.
దుర్వాసనకు టాయిలెట్ కమోడ్ కారణమైతే టాయిలెట్ ఫ్లష్ క్లీనింగ్ బాల్స్ ను ఉపయోగిస్తే అది టాయిలెట్ వాసనను తొలగిస్తుంది. సహజంగా టాయిలెట్స్ వెంటిలేషన్ లేకపోవడం వల్లే దుర్వాసన వస్తుంటాయి. కాబట్టి వెంటిలేషన్ లేని టాయిలెట్స్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని పెడితే టాయిలెట్ దుర్వాసన రాకుండా ఉంటుంది. అంతేకాదు బాత్ రూమ్ ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా వాసన రాదు.
ఖాళీ షాంపూ ప్యాకెట్లు, సబ్బు కవర్లు.. ఇలా బాత్ రూమ్ లో చెత్తంతా పెడితే బాత్ రూమ్స్ మురికిగా తయారవుతాయి. ఫలితంగా బాత్ రూమ్ దుర్వాసన వస్తుంది. ఇక బాత్ రూమ్ లో దుర్వాసన రాకుండా ఉండాలంటే మన ఇంటిలోనే స్ప్రే లను కూడా తయారు చేసుకోవచ్చు.

నీళ్ళలో 6 నుండి 8 గంటలు పుదీనా ఆకులను నానబెట్టి ఆ నీటిని స్ప్రే బాటిల్ లో నింపి, బాత్ రూం లో స్ప్రే చేస్తే కూడా అది దుర్వాసన రాకుండా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా టాయిలెట్స్ విషయంలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ నీట్ గా ఉంచుకుంటే దుర్వాసనకు ఆస్కారం లేకుండా ఉంటుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications