జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూపర్ కమిషనరమ్మ.. జనం మారడం లేదని కన్నీరు, ఇంతకీ ఏం చేశారు.. ఎక్కడంటే..?

|
Google Oneindia TeluguNews

పచ్చదనంతోపాటు పరిశుభ్రత కూడా ఇంపార్టెంటే.. తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తమవంతుగా కృషిచేస్తున్నారు. పట్టణాల్లో పట్టణ ప్రగతి పేరుతో మురుగు కాల్వల్లో చెత్తను తొలగిస్తూ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేదంపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

వారిలో రానీ మార్పు..

వారిలో రానీ మార్పు..

ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. జగిత్యాల పట్టణంలోని ఓ వార్డులో ప్రధాన కాల్వలో ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా మురుగునీరు పేరుకుపోయింది. శనివారం పారిశధ్య కార్మికులు వ్యర్థాలను తొలగించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఓ కార్మికుడు జారి కిందపడబోతుండటంతో తోటి కార్మికులు పట్టుకున్నారు. జనం ఏమీ పట్టించుకోకుండా ఇలా చేయడం ఏంటీ అని అంటున్నారు.

కలత చెందిన మున్సిపల్ కమిషనర్

కలత చెందిన మున్సిపల్ కమిషనర్

అయితే అక్కడ ఉండి ఇబ్బందులు గమనించి మున్సిపల్ కమిషనర్ కలత చెందారు. ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ప్రజల్లో ఎంత అవగాహన కల్పించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మురుగు కాల్వల్లోనే వేస్తున్నారని వాపోయారు. దీంతో వాటిని తొలగించే క్రమంలో కార్మికుల కష్టాలు వర్ణణాతీతం అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. దీని వల్ల కార్మికుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

సూపర్ కమిషనరమ్మ..

సూపర్ కమిషనరమ్మ..


అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయడం బెటర్.. దగ్గరుండి వ్యర్థాలు క్లీన్ చేయించారు. జనం మారడం లేదని ఏడవడం అంటే.. ఆమె ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారో అర్థం అవుతుంది. కొందరు కబుర్లు చెబుతారు.. ఊరికే టైంపాస్ చేస్తారు. కానీ కొందరే ఇలా జనం కోసం పాటుపడతారు. వారిలో జగిత్యాల మున్సిపల్ కమిషనర్ నిలుస్తున్నారు. ఆమెకు పట్టణ ప్రజలు సహకరించాలి. కానీ ఇలా చేయడం సరికాదని నెటిజన్లు అంటున్నారు.

English summary
jagtial municipal commissioner crying due to people behaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X