జూలై జంబోరీ: పండుగలా జరిగిన డిజిటల్ మీడియా, కంటెంట్ అనలిటిక్స్ అవార్డుల కార్యక్రమం
డిజిటల్ మీడియా ఇన్నోవేషన్స్, మరియు కంటెంట్ అనలిటిక్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు ఎంక్యూబ్ అవార్డ్స్ 2023 , అన్‌లాక్డ్ అవార్డ్స్ 2023 సంయుక్తంగా ఒక కార్యక్రమం నిర్వహించాయి. జూలై జంబోరీ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఇంక్‌స్పెల్ మీడియా నిర్వహించింది. "సెలబ్రేటింగ్ ఇన్నోవేషన్స్" నేపథ్యంలో సాగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో పేరుగాంచిన ఇండస్ట్రీ ప్రముఖులు వారు సాధించిన విజయాలు పంచుకునేందుకు చక్కటి వేదికగా నిలిచింది.
అన్‌లాక్డ్ అవార్డ్స్ 2023: ఇంక్ స్పెల్ మీడియా మరియు గ్లోబల్ ట్రెండ్స్ ఫోరం చొరవ తీసుకుని ఎవరైతే వారి సంబంధిత పరిశ్రమ రంగాల్లో అసాధారణమైన ఆవిష్కరణలు, సృజనాత్మకత,స్థితిస్థాపకతను ప్రదర్శించారో వారిని గుర్తించి గౌరవించడం జరిగింది. ఎదురొచ్చిన సమస్యలను అధిగమిస్తూ అవకాశంగా మలుచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించి క్యాంపెయిన్లు, కార్యక్రమాలు, సేవలు, పరిష్కార మార్గాలు చూపించి వారి రంగాల్లో గేమ్‌ఛేంజర్స్‌గా నిలిచారో వారిని అవార్డులతో గుర్తించి గౌరవించింది.

క్రియేటివిటీ, సృజనాత్మకత, ప్రభావం,స్థిరత్వం వంటి అంశాలపై వచ్చిన ఎంట్రీలను జాగ్రత్తగా పరిశీలించారు నిపుణులు. వీరిలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, మార్కెటింగ్ వెటరన్స్ ఉన్నారు. విజేతల్లో సీసీ అవెన్యూ-ఇన్ఫీబీమ్ అవెన్యూస్ లిమిటెడ్, Unspoken - #StoryOfAFatherAndSon, ధార్ మన్- షార్ట్ వీడియోస్, విటియన్, స్టార్ బక్స్ ఇండియా, ఇంటెంట్ ఫార్మ్ ఎక్స్ క్యూబెలెలోతో పాటు మరి కొందరు ఉన్నారు.ప్రతి విజేత తాము సాధించిన విజయాల గురించి చెబుతూ ఇతరులు కూడా వారి వారి రంగాల్లో ఎలా విజేతలుగా నిలవాలో చెబుతూ స్ఫూర్తి నింపారు.
విజేతలకు, నామినేట్ అయినవారికి ఇంక్ స్పెల్ మీడియాలో హెడ్ ఆఫ్ అలయెన్సెస్ చిత్ర సురానా అభినందించారు. ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. అడ్డంకులన్నీ అధిగమించి విజేతలుగా నిలిచినవారిని అభినందించారు. భవిష్యత్తులో వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింతగా రాణించాలని చెప్పారు.
ఎంక్యూబ్ అవార్డులు 2023:డిజిటల్ మీడియా ఆవిష్కరణలకు గుర్తింపు : డిజిటల్ మీడియాలో సాధించిన గొప్ప విజయాలకు గుర్తించింది ఎంక్యూబ్ అవార్డ్స్ 2023. పలు కేటగిరీల్లో అంటే వీడియో మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్,సోషల్ మీడియా, మొబైల్ మార్కెటింగ్‌తో పాటు ఇంకొన్ని కేటగిరీల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన వారిని లేదా సంస్థలను గుర్తించి అవార్డులు అందజేసింది. కంటెంట్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించే డేటా అనలిటిక్స్ పై పట్టు సాధించిన వ్యక్తులను, బృందాలను ఈ వేదిక ద్వారా అవార్డులతో గౌరవించింది.
ప్రముఖ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్ర, జీ5, సోనీ లైవ్, పైసాబజార్ డాట్ కామ్ సంస్థల నుంచి పలువురు ప్రముఖులు స్పీకర్లుగా జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. ఇక విజేతలుగా నిలిచిన వారిలో జీ బంగ్లా నిర్వహించిన మదర్స్ డే క్యాంపెయిన్, Unspoken - #StoryOfAFatherAndSon, #MarketMasala by HDFC Securities, నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో దేశ్ కేలియే మజ్ను, జియో వీఐపీ బాక్స్‌తో పాటు మరికొన్ని ఉన్నాయి.డిజిటల్ మార్కెటింగ్ రంగంలో డేటా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ విజేతలు చెప్పుకొచ్చారు.
జూలై జంబోరీ అనే ఈ కార్యక్రమం ఎంక్యూబ్ అవార్డ్స్ 2023 మరియు అన్‌లాక్డ్ అవార్డ్స్ 2023లను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ఆసాంతం హాజరైన వారు చక్కటి ఆరోగ్యవంతమైన చర్చలు, అనుభవాలు, ఇన్‌సైట్స్‌ను పంచుకున్నారు. జూలై జంబోరీ కార్యక్రమం డిజిటల్ మీడియా మరియు మార్కెటింగ్ పై చెరగని ముద్ర వేసింది.ఈవెంట్ నిర్వాహకులు ఇంక్‌స్పెల్ మీడియా, గ్లోబల్ ట్రెండ్స్ ఫోరమ్‌లు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న డిజిటల్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిపుణులు తమ సూచనలు సలహాలు ఇస్తామని తెలిపారు.
ఇక ఈ రెండు కార్యక్రమాలకు పింక్ విల్లా, జోష్ యాప్-వర్సే ఇన్నోవేషన్, గ్లోబల్ ట్రెండ్స్ ఫోరమ్, ఇండియా క్రియేటివ్ ఇండస్ట్రీస్ కౌన్సిల్, కెన్సియో, వన్ ఇండియా, ఈడీ టైమ్స్, 24 ఫ్రేమ్స్ డిజిటల్, జియో న్యూస్, ఈజీ డైనర్‌లు కీలక భాగస్వాములుగా వ్యవహరించాయి.
జూలై జంబోరీ గురించి మరింత సమాచారం, పూర్తి స్థాయి విజేతల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి :https://www.mcubeawards.com& https://www.unlockedawards.com/
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications