Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bajaj Finance: బజాజ్ ఫైనాన్స్ ఇంటరెస్ట్ కాలిక్యులేటర్‌తో మాస్టర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రణాళిక..!

స్థిరమైన ఆర్థిక భవిష్యత్తును రూపొందించడానికి ఆలోచనాత్మకమైన ప్రణాళిక కావాలి. అంటే మీ లక్ష్యాలను తెలుసుకోవడం, మీ ఖర్చులను నిర్వహించడం, మరియు మీ అవసరాలతో అనుగుణంగా ఉన్న పెట్టుబడులను ఎంచుకోవడం. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా వడ్డీ సంపాదించడానికి మీరు నమ్మకమైన మార్గాన్ని అన్వేషిస్తుంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (ఎఫ్‌డీలు) భారతదేశంలో ఎంతో కాలంగా ప్రసిద్ధి చెందిన నిర్ణయంగా నిలిచాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏంటి?
ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) అనేది మీ ఆదాయం పై వడ్డీ సంపాదించడానికి ఒక సరళమైన మార్గం. మీరు కొంత మొత్తం డబ్బుని ఒక నిర్దిష్టమైన సమయం కోసం బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌తో ఉంచుతారు. ఫలితంగా, వారు మీకు ఒక నిర్ణయించబడిన వడ్డీ రేటుకు హామీ ఇస్తారు. మెచ్యూరిటీ సమయం చివరిలో, మీరు మీ అసలు మొత్తం ప్లస్ పోగైన వడ్డీ అందుకుంటారు.

Know how to calculate the interest for master fixed deposit plan with Bajaj finance interest calculator tool

ఎఫ్‌డీలలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

ఎఫ్‌డీలు మంచి పెట్టుబడి ఆప్షన్‌గా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి:
•గ్యారంటీ రాబడులు: పెట్టుబడి పెట్టిన సమయంలో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ నిర్ణయించబడి ఉంటుంది. అంటే మీరు మీ పెట్టుబడిపై ఎంత డబ్బు ఖచ్చితంగా సంపాదిస్తారో మీకు ముందే తెలుస్తుందని అర్థం.

•సరళత: ఎఫ్‌డీలు వివిధ వ్యవధులలో వస్తాయి, కొన్ని రోజుల నుండి సంవత్సరాల వరకు. మీ ఆర్థిక లక్ష్యాలు మరియు సమయాలకు ఉత్తమంగా సరిపోయే కాల పరిమితిని ఎంచుకోండి.

•నగదు: ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌కు నిర్ణయించబడిన వ్యవధి ఉన్నప్పటికీ, చాలా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ముందస్తుగా డబ్బు తీసుకోవడానికి (విత్ డ్రాల్స్ కు) అనుమతి ఇస్తాయి. ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఇది వెంటనే నిధులను అందుబాటులో ఉంచుతుంది కానీ ఇది జరిమానా ఫీజు (అపరాధ రుసుం) విధించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ముందు మీ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌ను సంప్రదించవలసిందిగా సిఫారసు చేయబడింది.
బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీ ఫీచర్స్

భారతదేశంలో విస్తృత శ్రేణి ఎఫ్‌డీ ప్రోడక్ట్స్‌ను అందించే ఒక ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీల యొక్క కొన్ని ఫీచర్స్‌లో ఇవి భాగంగా ఉన్నాయి:

•ఆకర్షణీయమైన రాబడి: బజాజ్ ఫైనాన్స్‌తో, మీరు తక్కువ ఆదాయాలకు రాజీపడవలసిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం 8.85 శాతం వరకు ఉన్న వారి మార్కెట్‌కు అనుగుణంగా ఉండే వడ్డీరేట్స్ మీ ఆదాలు స్థిరంగా మరియు గణనీయంగా వృద్ధి చెందడంలో సహాయపడతాయి.

•మీ ప్రణాళికల కోసం పరిపూర్ణంగా యోగ్యమైనది తెలుసుకోండి: మీరు స్వల్పకాలిక లక్ష్యం కోసం లేదా దీర్ఘకాలిక కల కోసం ఆదా చేస్తుంటే బజాజ్ ఫైనాన్స్ 12 నుండి 60 నెలల సరళమైన వ్యవధితో ఎఫ్‌డీలు అందిస్తుంది.

•ఇబ్బందిని దాటవేయండి, సౌలభ్యంతో పెట్టుబడి పెట్టండి: ఎవరు కూడా క్లిష్టమైన డాక్యుమెంట్స్ పనిని ఇష్టపడరు! బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఎఫ్‌డీని బుక్ చేయండి మరియు నిర్వహించండి, దీనిని వాడటం సులభం మరియు ఇది మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

•ఆత్మవిశ్వాసంతో పెట్టుబడి పెట్టండి: మీ డబ్బుకు ఉత్తమమైన రక్షణ కలిగి ఉండే అర్హత ఉంది. బజాజ్ ఫైనాన్స్ CRISIL మరియు ICRA వంటి ఫైనాన్షియల్ ఏజెన్సీల నుండి ఎఫ్‌డీలు టాప్-టియర్ AAA రేటింగ్స్‌ను కలిగి ఉన్నాయి. మీ పెట్టుబడి సురక్షితంగా మరియు భద్రంగా ఉండేలా మీకు హామీ ఇస్తాయి.

వేగవంతమైన మరియు ఖచ్చితమైన బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీ కాలిక్యులేటర్‌ను ఏ విధంగా ఉపయోగించాలి

బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీ కాలిక్యులేటర్ ఒక ఉచిత ఆన్‌లైన్ సాధనం. ఇది మీ ఎఫ్‌డీ పై మీరు సంపాదించే వడ్డీని లెక్కించడంలో సహాయపడుతుంది. కాలిక్యులేటర్‌ను వాడటానికి, ఈ కింది సమాచారం నమోదు చేయండి:

•కస్టమర్ రకం (సీనియర్ సిటిజన్ లేదా 60 ఏళ్ల లోపు వాళ్లు)

•పెట్టుబడి మొత్తం

•వ్యవధి

•వడ్డీ చెల్లింపు తరచుదనం (నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలు, సంవత్సరం లేదా మెచ్యూరిటీ సమయంలో)

మీ పెట్టుబడి ఎంత వృద్ధి చెందుతుందో కాలిక్యులేటర్ ఖచ్చితంగా విభజిస్తుంది, మెచ్యూరిటీ మరియు వడ్డీ మొత్తం రెండిటిని ప్రదర్శిస్తుంది.

ఎఫ్‌డీ ప్రణాళిక

•మీ ఆర్థిక లక్ష్యాలు ఏర్పర్చుకోండి: మీరు ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడానికి ముందు, మీ ఆర్థిక లక్ష్యాలను రూపొందించుకోవడం ముఖ్యం. ఇది అనుకూలమైన పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయించడంలో మరియు మీ ఆర్థిక లక్ష్యాలతో అనుగుణంగా ఉండే మెచ్యూరిటీ సమయంతో మీకు సహాయపడుతుంది.

•సరైన ఎఫ్‌డీ ఎంచుకోండి: వివిధ రకాల ఎఫ్‌డీలు అందుబాటులో ఉన్నాయి. మీ పెట్టుబడి అవసరాలు మరియు రిస్క్ టాలరెన్స్‌ కు అనుగుణంగా ఉన్న ఎఫ్‌డీని ఎంచుకోండి.

•వడ్డీ రేట్స్ పోల్చండి: క్షుణ్ణంగా పరిశోధించండి మరియు వివిధ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అందించే వడ్డీ రేట్స్‌ను పోల్చండి.

•స్థిరత్వం కీలకం: రెగ్యులర్ పెట్టుబడులు, చిన్న మొత్తాలైనా, రెట్టింపు రాబడి శక్తి ద్వారా సుస్థిరమైన వృద్ధిని సృష్టించవచ్చు.

•వృత్తిపరమైన సంప్రదింపు: మీకు మీ పెట్టుబడి గురించి ఖచ్చితంగా తెలియకపోతే, నిపుణుల సలహా తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. మీ వ్యక్తిగత లక్ష్యాలు మరియు పరిస్థితులకు జతపడే సరైన పెట్టుబడి ఆప్షన్‌ను ఎంపిక చేయడంలో ఆర్థిక సలహాదారులు మీకు సహాయపడతారు.

ముగింపు

మీ ఆర్థిక ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఫిక్స్డ్ డిపాజిట్స్ భద్రత మరియు సుస్థిరతలను అందిస్తాయి. గ్యారంటీ రాబడులు మరియు వివిధ మెచ్యూరిటీస్‌తో, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి అవి శక్తివంతమైన పెట్టుబడి ఐచ్ఛికం. మీ వ్యక్తిగత అవసరాలతో అనుగుణంగా ఉన్న రేట్స్ మరియు నియమాలు పొందడానికి వివిధ ఎఫ్‌డీ ఆప్షన్స్‌ను బాగా పరిశోధన చేయండి మరియు బలమైన ఆర్థిక పునాది నిర్మాణాన్ని ప్రారంభించండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+