కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎరా హన్మంతు.. ఎందీ ఇదీ.. పెన్సిల్ దొంగిలిస్తే కేసా..? చిన్నారి హల్ చల్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

అప్పుడప్పుడు చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. అవును పిల్లలు కూడా వార్తల్లో నిలుస్తున్నారు. అసలే వారు పిల్లలు.. ఏదో దొంగతనం పేరుతో ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. అవును ఈ ఘటన.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఆ బుడ్డొడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ చిన్నారి హన్మంత్.. కోపానికి కారణం ఏంటో తెలుసా.. మరో చిన్నారి పెన్సిల్ దొంగిలించడమే.. ఆ పోలీసులు.. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.

Recommended Video

Viral: Police Complaint For Pencil బుడ్డోడి పోలీస్ కంప్లైంట్... రాయలసీమ బ్లడ్ మరి || Oneindia Telugu
కేసు అంటూ..

కేసు అంటూ..

స్నేహితుడు పెన్సిల్ దొంగిలించాడంటూ ఓ పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. హోం వ‌ర్క్ చేసుకుంటుంటే మ‌రో బాలుడు త‌న పెన్సిల్ ఎత్తుకెళ్లాడ‌ని ఫిర్యాదు చేశాడు. క‌ర్నూల్ జిల్లాలోని పెద క‌డుబూరు ప‌రిధిలో ఘటన జరిగింది. హ‌న్మంత్ అనే విద్యార్థి పెన్సిల్‌ను మ‌రో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హ‌న్మంత్ స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి పెన్సిల్ దొంగ‌త‌నంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ప్ర‌తి రోజు పెన్సిల్స్ దొంగ‌త‌నం చేస్తున్నాడు. పైస‌లు కూడా తీసుకుపోతున్నాడు. రోజు ఇదే ప‌ని అని హ‌న్మంత్ పోలీసుల‌కు చెప్పాడు. ఈ ఒక్క‌సారి కేసు పెట్టండి అని కోరాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయిపోయింది.

పెన్సిల్ దొంగిలించాడట..

పెన్సిల్ దొంగిలించాడట..

సార్ పెన్సిల్ తిరిగి ఇచ్చాను అని మ‌రో అబ్బాయి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అయినా హ‌న్మంత్ మాత్రం విన‌లేదు. ఇదొక్క‌సారి కేసు పెట్టండి సార్ అని పోలీసుల‌ను అడిగాడు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా హన్మంత్ మాత్రం వినలేదు. కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. బెయిల్ ఇవ్వడం.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇబ్బంది అవుతుందని స్టేషన్ ఇంచార్జీ చెప్పినా పట్టించుకోలేదు. అప్పటివరకు ఊ అని తల ఊపాడు. తర్వాత కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు.

వద్దు హన్మంత్

వద్దు హన్మంత్

స్టేషన్‌కు రాగానే.. పేర్లు అడిగారు. హన్మంత్ పేరు చెప్పి.. దొంగతనం అంటూ తన వాదన వినిపించాడు. కేసు పెట్టాలని సూచించాడు. వద్దు కేసు ఎందుకు.. వదిలేయు.. బెయిల్ రావడం కష్టం అని చెప్పిన వినలేదు. అతని తీరుతో పోలీసులు స‌ర‌దాగా న‌వ్వుకున్నారు. ఈ సారికి వద్దు హన్మంత్ అంటూ సర్ది చెప్పారు. ఇద్ద‌రూ బాగా చదువుకోవాల‌ని పోలీసులు సూచించారు.

English summary
boy hanmanth complaint on his friend. his pencil stolen from bag. incident happen at kurnool kadubur police station limits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X