Bike Servicing: బైక్ సర్వీసింగ్‌లో ముఖ్యం బిగులు.. అస్సలు పొరపాటున కూడా తప్పుచేయెుద్దు
Bike Service Tips: నేటి కాలంలో ఏ చిన్న పని చేసుకోవాలన్ని కనీసం 2-3 కిలోమీటర్లు గ్రామాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అదే నగరాల్లో అయితే 5-10 కిలోమీటర్ల దూర ప్రయాణం సర్వ సాధారణంగా ఉంటుంది. పదుల కిలోమీటర్లు రోజూ ప్రజలు బైక్ పై ప్రయాణిస్తూనే ఉంటారు. పైగా రోజుకో మోడల్ స్కూటర్లు, బైక్స్ మార్కెట్లోకి వస్తున్న వేళ నచ్చిన మోడల్ కొంటూ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం రెండు లేదా అంత కంటే ఎక్కువ బైక్స్ ఉంటున్నాయి. బైక్స్ కొనటం ఎంత ఇష్టంగా చేశారో వాటి నిర్వహణను సైతం ప్రజలు అంతే శ్రద్ధతో చేయకపోతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనికోసం ముందుగా ద్విచక్రవాహనాలను ఇంటివద్ద తరచుగా శుభ్రపరచుకోవటం ముఖ్యం.
మనుషులకు మాదిరిగానే వాహనానికి కూడా ఆరోగ్యం చాలా ముఖ్యం. దీనిని నిర్వహించటానికి చాలా మంది బైక్ మెకానిక్స్ చెప్పేది వాహనానికి సరైన విధంగా మెయిన్టెన్ చేయటం. ఇందులో ముఖ్యమైనది స్కూటర్ లేదా బైక్ ఇంజన్ ఆయిల్ క్రమం తప్పకుండా మార్చుకోవటం. దీనికింద ప్రతి 2000 కిలోమీటర్లకు లేదా రెండు నెలలకు ఒకసారి బైక్ ఇంజన్ ఆయిల్ మార్చుకోవటం. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల బండి ఇంజన్ ఆరోగ్యకరంగా ఉంటూ స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది బండి మైలేజీని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ఇంజన్ ఆయిల్ మార్చకపోవటం మైలేజీని తగ్గించే ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా మెకానిక్స్ చెబుతుంటారు. అందుకే దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. దీనికి తోడు సర్వీసింగ్ చేయించే ప్రతి సారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించుకోవటం లేదా కొత్తది మార్చుకోవటం. ఇది ఇంజన్ కంబషన్ సమయంలో గాలి సరఫరాను అందించటానికి చాలా ముఖ్యమైనదని వాహనదారులు గుర్తుంచుకోవాలి.

వాహనాన్ని సర్వీసింగ్ చేయించుకునే సమయంలో అస్సలు చేయకూడని తప్పు ఒకటి ఉంది. దీనిని వాహనదారులు గుర్తుంచుకోవాలి. అదే బండికి సంబంధించి కార్బ్యురేటర్‌కి సంబంధించినది. బైక్ క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించే వ్యక్తులు ప్రతిసారి దీనిని క్లీన్ చేయించాల్సిన అవసరం ఉండదని గుర్తుంచుకోవాలి. అందువల్ల అనవసరంగా సర్వీసింగ్ చేయించేటప్పుడు మెకానిక్ చెప్పినప్పటికీ కార్బ్యురేటర్ ఓపెన్ చేయకుండా ఉండటం మంచిది. బైక్ ముందుకు నడవటానికి అవసరమైన శక్తి ఇక్కడే తయారవుతుంది. పెట్రోల్ ట్యాంక్ నుంచి వచ్చే ఇంధనాన్ని గాలి సమపాళ్లలో కలిసేది ఇక్కడే. దీనిని అనవసరంగా ఓపెన్ చేయటం వల్ల అది బండి పనితీరును దెబ్బతీస్తుంటుంది. మైలేజీ భారీగా డ్రాప్ అయిన సందర్భాల్లో లేదా బండి పెట్రోల్ ఉన్నా ఆగిపోతున్న సమయాల్లో మాత్రమే మెకానిక్స్ కార్బ్యురేటర్ ఓపెన్ చేసి ఏదైనా నలకలు ఉంటే వాటిని శుభ్రం చేస్తుంటారు. అందువల్ల ఇటీవల బీఎస్-6 మోడల్ ద్విచక్రవాహనాల్లో కంపెనీలు కార్బ్యురేటర్ బదులుగా ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్ అందిస్తున్నాయి.
మార్కెట్లో చాలా మంది ఇప్పటికి కార్బ్యురేటర్ ఉన్న పాత టెక్నాలజీ వాహనాలను వాడుతున్నందున దీని విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. రిపేర్ చేయటానికి ఓపెన్ చేసిన క్రమంగా డ్యామేజ్ అయితే అది లీకేజీలకు దారితీస్తుంది. ఇది ఇంజిన్ పనితీరుపై తీవ్ర ప్రభావితం చూపిస్తుంది. కొన్నిసార్లు కార్బ్యురేటర్ బిగించిన తర్వాత మెకానిక్స్ వాటిలో చిన్న చిన్న ఎడ్జెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఇంధనం లీక్ అయితే కార్బ్యురేటర్ తెరిచి మరమ్మత్తు చేయవలసి ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వీలైనంత వరకు కంపెనీ సర్వీస్ టెక్నీషియన్ల వద్దకు వెళ్లటం ఉత్తమం. వారికి వాహనంపై పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఏదైనా పార్ట్ ఒకవేళ డ్యామేజీ అయితే దానిని జెన్యూస్ స్పేర్ పార్ట్ ఉపయోగించి రిపేర్ చేస్తారు. ఇది బండి దీర్ఘకాలిక పనితీరును మెరుగుపరుస్తుంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications