86 మంది బానిస mlas, 15 మంది దద్దమ్మ ministers: రాజగోపాల్ రెడ్డి హాట్ ట్వీట్
మునుగోడు బై పోల్ ప్రచారం చివరి దశకు చేరింది. నేతల మధ్య విమర్శలు కూడా హోరెత్తుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మంత్రుల మధ్య మాటల యుద్దమే జరుగుతుంది. మంత్రి కేటీఆర్, బండి సంజయ్ కూడా విమర్శల జడి వాన కురిపిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి రావడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

మునుగోడులో బస..
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇవాళ ట్వీట్ చేస్తూ.. విమర్శలు చేశారు. అధికారం మార్పు కోసమే తాను పదవీకి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రం కల్వకుంట్ల కబందహస్తాల్లో చిక్కుకుందని విమర్శలు చేశారు. తాను రాజీనామా చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కదలిందని గుర్తుచేశారు. అంతా మునుగోడు కేంద్రంగా ఉన్నారని.. నాటి హామీలు కూడా చేస్తామని అంటున్నారని గుర్తుచేశారు.
86 మంది బానిస ఎమ్మెల్యేలు
తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే 86 మంది బానిస ఎమ్మెల్యేలు వచ్చారని గుర్తుచేశారు. 15 మంది "దద్దమ్మ" మంత్రులు కూడా నియోజకవర్గంలో దిగారని మండిపడ్డారు. 12 మంది "అసమర్థ " ఎమ్మెల్సీలు & ఎంపీలు కూడా చక్కర్లు కొడుతున్నారని విమర్శలు చేశారు. ఓ "దగాకోరు" ముఖ్యమంత్రి వచ్చారని పేర్కొన్నారు. ఇదీ అవసరమా ? అంటూ ట్వీట్ చేశారు. అభివృద్ధి చేసి ఉంటే ఇంతమంది మునుగోడు రావాల్సిన అవసరం ఏముందని అడిగారు.

కేసీఆర్ సభ వేళ
ఇవాళ మునుగోడులో సీఎం కేసీఆర్ సభ ఉన్న సమయంలో రాజగోపాల్ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. అదీ కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారని అర్థం అవుతుంది. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ జరగాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల అదీ రద్దయిపోయింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రచ్చ రచ్చ కాగా.. బీజేపీ అగ్రనేతలు గుర్రుమీద ఉన్నట్టు సమాచారం. ఢిల్లీకి రావాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను నడ్డా ఆదేశించారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే నడ్డా బహిరంగ సభను రద్దు చేసి ఉంటారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications