నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆనందయ్య మందు: తొలి దశ అధ్యయనం పూర్తి.. టాక్సిస్ స్టడీ, జంతువులపై పరీక్షలు

|
Google Oneindia TeluguNews

ఆనందయ్య ఆయుర్వేద మందుపై గురించి గుడ్ న్యూస్ తెలిసింది. ఆనందయ్య ఆయుర్వేద మందుపై తొలి దశ అధ్యయనం పూర్తయింది. మలిదశ ప్రక్రియ పూర్తయి.. నివేదిక అనుకూలంగా వస్తే అంతే.. అందరికీ అందుబాటులోకి వస్తోంది. వాస్తవానికి ఆనందయ్య మందు వాడడానికి జనం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మందుపై సీసీఆర్ఏఎస్ ఆదేశాలతో రెస్ట్రోపెక్టివ్ స్టడీ పూర్తి చేసింది. మందు తీసుకున్న 570 మందితో తిరుపతి, విజయవాడకు చెందిన ఆయుర్వేద వైద్యులు మాట్లాడారు. దీనికి సంబంధించి ఆన్ లైన్‌లో వివరాలను అప్ లోడ్ చేశారు. దీనికి సంబంధించి సీసీఆర్ఏఎస్ నుంచి రేపటిలోగా ఆదేశాలు వస్తాయి. సీసీఆర్ఏఎస్ అనుమతితో తర్వాత దశలో టాక్సిస్ స్టడీ, జంతువులపై పరీక్షలు చేస్తారు.

anandaiah ayurvedic medicine first fage done

ఇటు జంతువులపై ఆనందయ్య మందు ప్రయోగించాలని శాస్త్రవేత్త భావిస్తున్నారు. ఆనందయ్య మందుపై అనుమతి వస్తే ప్రయోగాలు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలుకలు, కుందేళ్లపై ప్రయోగం చేసి రిపోర్ట్ ఇస్తామని, జంతువులకు విడతలవారీగా ఆనందయ్య మందు ఇచ్చి చూస్తామని తెలిపారు. ప్రయోగాలకు 14 నుంచి 28 రోజులు సమయం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

గత 15 ఏళ్లుగా పలు మందుల విషయంలో.. తమ ల్యాబ్‌లో జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని, కొవిడ్ అధికంగా ఉన్న జంతువుపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జంతువుకు కరోనా సోకించి పరీక్ష చేసే వ్యవస్థ తమ దగ్గర లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary
anandaiah ayurvedic medicine first fage done. second stage is taxis study and experment to animals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X