నెల్లూరుకు పాకిన మెట్రో స్టైల్.. స్పా ముసుగులో వ్యభిచారం..!
నెల్లూరు : మెట్రో నగరాల పోకడ పట్టణాలకు చేరుతున్న వైనం విస్మయం కలిగిస్తోంది. మెట్రో కల్చర్ నగరాలను దాటి పట్టణాలకు చేరుతున్న వేళ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో నెల్లూరులో వెలుగుచూసిన ఘటన చర్చానీయాంశంగా మారింది. స్పా ముసుగులో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వైనం బయటపడింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిర్వాహకుల గుట్టురట్టు చేశారు.
మెట్రో నగరాల్లో కన్పించే స్పా కల్చర్ నెల్లూరులో దర్శనమివ్వడం.. ఆ పేరు చెప్పి అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం స్థానికులు నివ్వెరపోయేలా చేసింది. మసాజ్ ముసుగులో గలీజు దందా చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కడం హాట్ టాపికయింది.

నెల్లూరులో వ్యభిచారం.. స్పా ముసుగులో దందా
మెట్రో కల్చర్ నగరాలు దాటుతోంది. క్రమక్రమంగా పట్టణాలకు చేరుతోంది. అదే క్రమంలో నెల్లూరులో స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టైంది. స్థానిక మాగుంట లేఔట్‌లో స్పా పేరిట రెచ్చిపోతున్న కొందరు చివరకు పోలీసుల వలకు చిక్కారు. సోమవారం నాడు స్పా సెంటర్‌పై దాడిచేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
వెంకటగిరి ప్రాంతానికి చెందిన ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి కొన్నేళ్ల కిందట నెల్లూరుకు వచ్చారు. మాగుంట లేఔట్‌లో నివాసం ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఆ క్రమంలో స్పా పెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చి శ్రీకారం చుట్టారు. అదే ప్రాంతంలో మెయిన్ రోడ్డుపై గల స్టూడియో 11 సెలూన్ అండ్ స్పా సెంటర్‌ను లీజుకు తీసుకున్నారు. దాదాపు నెలకు 70 వేల రూపాయల లీజ్ ఎమౌంట్ పే చేస్తూ దాన్ని నడిపిస్తున్నారు.

బోర్డేమో స్పా సెంటర్.. లోనికెళితే ఆ మజా..!
సదరు స్పా సెంటర్ ధనుంజయ రెడ్డి చేతిలోకి వచ్చాక దాని రూపురేఖలు మారిపోయాయి. స్పా సెంటర్‌ను అత్యాధునిక హంగులతో రెనోవేట్ చేయించారు. ఇక అక్కడి నుంచి తన బిజినెస్ తెలివితేటలను కార్యరూపంలోకి తీసుకొచ్చారు. పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి.. స్పా కు వచ్చే కస్టమర్లకు మసాజ్ సర్వీస్ ఆఫర్ చేసేవారు. ఆ క్రమంలో ఆ అమ్మాయిలతోనే వ్యభిచారం చేయిస్తూ వచ్చారు.
స్పా సెంటర్ కాస్తా వ్యభిచార కూపంగా మారింది. దాంతో కస్టమర్ల సంఖ్య కూడా పెరిగింది. నిత్యం విటులతో కిటకిటలాడుతూ దినాదినాభివృద్ధి చెందింది సదరు స్పా సెంటర్ కమ్ బ్రోతల్ హౌస్. అయితే యజమాని ధనుంజయ రెడ్డి మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. స్పా సెంటర్‌కు సంబంధించిన లావాదేవీలు మొత్తం ఫోన్ ద్వారానే జరిగేలా చూసుకున్నారు. అలా అక్కడి విషయాలు బయటకు రాకుండా మెయిన్‌టెయిన్ చేశారు.

పోలీసులు అటాక్.. నిర్వాహకుడికి చెక్
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాలతో నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసులు స్పా సెంటర్‌పై ఓ కన్నేశారు. నిఘా పెట్టడంతో గుట్టురట్టైంది. అదే క్రమంలో సోమవారం నాడు వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో డీఎస్పీ శ్రీనివాసులు, ఇతర పోలీస్ సిబ్బంది స్పా సెంటర్‌పై దాడి చేశారు. వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకుని నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులను, మరో ఇద్దరు సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.
అదలావుంటే నిర్వాహకుడు ధనుంజయ రెడ్డి ఫోన్ పరిశీలించిన పోలీసాధికారులు నివ్వెరపోయారు. ఆ ఫోన్ నిండా అశ్లీల చిత్రాలు.. విటుల నంబర్లు కనిపించేసరికి కంగుతిన్నారు. ఇద్దరు విటులతో పాటు నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు ఫైల్ చేశారు. అలాగే ఇద్దరు సెక్స్ వర్కర్లను స్థానిక రెస్క్యూ హోమ్‌కు తరలించారు.

అక్కడ వ్యభిచారం జరుగుతోందా.. నోరెళ్లబెట్టిన స్థానికులు..!
మెట్రో నగరాల్లో కనిపించే స్పా సెంటర్ నెల్లూరులో దర్శనమివ్వడం.. మసాజ్ పేరిట వ్యభిచారం నిర్వహించడం.. స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. ఇక్కడో ట్విస్టు ఏంటంటే రెసిడెన్షియల్ కాంప్లెక్సులో ఇలాంటి దందాలు చేస్తే దొరికిపోతామనే భయంతో నిర్వాహకుడు కమర్షియల్ బిల్డింగ్‌ను ఎంచుకోవడం గమనార్హం. చుట్టుపక్కల వారికి కూడా అక్కడ మసాజ్ సెంటర్ ఉందనే విషయం తెలుసు కానీ అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనేది మాత్రం తెలియదు. దాంతో ఇన్ని రోజులు నిర్వాహకుడికి కాసుల పంట పండింది.
సదరు స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేసి నుంచి విటులను, సెక్స్ వర్కర్లను బయటకు తీసుకురావడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతోందా అంటూ నోరెళ్లబెట్టారు. ఇదొక్కటే కాదు నగరంలో ఇలాంటి సెంటర్లు మరిన్ని ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications