కరోనా టైమ్‌లో తమరెట్టాబోయారో.. ఏమో సారు..
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట ఉమ్మడి నెల్లూరు జిల్లా. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఇదీ ఒకటి. 2014లోనూ మెజారిటీ నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుందీ పార్టీ. అదే ఊపును మళ్లీ కొనసాగించేలా కనిపిస్తోందా పార్టీ. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడిందనడానికి సాక్ష్యం.. ఈ ఉదంతం.
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అవకాశవాద రాజకీయాన్ని నిలదీసిన నెల్లూరు ప్రజలు pic.twitter.com/bm93U2yACW
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) October 1, 2023
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పొంగూరు నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. నెల్లూరు సిటీ పరిధిలోని మూలాపేటలో స్థానిక మహిళలకు ఆయనను నిలదీశారు. ఇన్ని రోజులు ఏమైపోయారంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు నారాయణ.

తనకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించిన నేపథ్యంలో- నారాయణ నెల్లూరు సిటీలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. తన పర్యటనలో భాగంగా మూలాపేటకు వెళ్లగా.. అక్కడ ఆయనను స్థానిక మహిళలు ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. బాగున్నారా సారూ అంటూనే ఆయనను నిలదీశారు.
అయ్యగారు బాగుండారా అయ్యగారు. నమస్కారం సారు. చాలా రోజులకు కనపడుతున్నారు సారు. కరోనా టైములో తమరెట్టాబోయారో ఏమో సారు. మిమ్మల్ని ఎక్కడా చూల్లేదు సారు. ఈ రోజు వచ్చారు కదా. మళ్లీ ఎప్పుడొస్తారు సారు. ఎన్ని సంవత్సరాలకు వస్తారు? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
దీనితో ఏమీ మాట్లాడలేకపోయారు నారాయణ. ఆయనతో ఉన్న అనుచరులు ఆ మహిళలను సర్దిచెప్పబోయారు గానీ వినిపించుకోలేదు. అయ్యగారు మేం పనికి రాం. మా ఓట్లు పనికి రావాలా.. అంటూ ఆయనపై సెటైర్లు వేశారు. మా సమస్యలు కూడా చెప్పుకోకూడదా?.. అయితే దేనికి వచ్చినట్లు, దేనికి వెళ్తున్నట్లు అంటూ ప్రశ్నించారు.
వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోన్న నియోజకవర్గం.. నెల్లూరు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి ఘన విజయాలను సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీధర కృష్ణారెడ్డిని సుమారు 19 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు. 2019లో పొంగూరు నారాయణపై 1,988 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో ఓడిపోయిన నారాయణకే మరోసారి అవకాశాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసినప్పటికీ.. అనిల్ కుమార్ యాదవ్‌కు గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ మరోసారి నారాయణనే నమ్ముకుంది. ఈ నియోజకవర్గంలో వైెఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు మరొకరు లేకపోవడం, ఆర్థికంగా బలవంతుడు కావడం వల్ల నారాయణకే అవకాశం ఇచ్చింది.












Click it and Unblock the Notifications