వచ్చే ఏప్రిల్‌లోనే ఐపీఎల్ 2021.. అవకాశం ఇస్తే రాహుల్ రాణిస్తాడు: సౌరవ్ గంగూలీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ సక్సెస్‌పుల్‌గా స్టార్ట్ అయి ముగింపు దశకు చేరుకొంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఎన్నో ఆటంకాలను అధిగమించిన బీసీసీఐ చివరకు విజయవంతంగా టోర్నీని నిర్వహించింది. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వచ్చే ఐపీఎల్ 2021 సీజన్ భారత్‌లోనే నిర్వహిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. శనివారం ఇండియా టుడేతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'వచ్చే ఏప్రిల్-మేల్లో ఐపీఎల్-2021ను స్వదేశంలోనే నిర్వహిస్తాం. 14వ సీజన్ కూడా యూఈఏనే వేదిక అంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను సొంతగడ్డపైనే జరుపుతాం. రంజీ ట్రోఫీలకు కూడా సన్నద్ధమవుతున్నాం. ఇందు కోసం బయో బబుల్‌ను ఏర్పాటు చేయనున్నాం'అని గంగూలీ చెప్పాడు.
ఐపీఎల్ విజయంతో ఐఎస్ఎల్ లాంటి లీగ్‌ల నిర్వహణకు మార్గం సుగమమైందన్నాడు. ఐపీఎల్‌ను బయో బబుల్‌లో జరపడానికి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చిన సిరీస్‌లను పరిశీలించామని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే తదుపరి సీజన్ కోసం వేలం నిర్వహించే విషయంపై మాత్రం స్పందించలేదు.

సెలెక్టర్లు అవకాశం ఇస్తే టెస్ట్‌ల్లోనూ కేఎల్ రాహుల్ సత్తా చూపెడతాడని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. లాంగ్ ఫార్మాట్‌లో రాహుల్ చాలా దూరం వెళతాడని బీసీసీఐ బాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'కేఎల్ రాహుల్ టెస్ట్‌ల్లో చాలా సాధిస్తాడు. జట్టులో ఎక్కువ కాలం కొనసాగుతాడు.
ఓ క్రికెటర్‌గా అతనిపై నాకు నమ్మకం ఉంది. అన్ని ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న క్రికెటర్ అతను. కానీ రాహుల్ విషయంలో సెలక్టర్లదే తుది నిర్ణయం. రాహుల్ భారత్‌కు మరిన్ని విజయాలందించాలని కోరుకుంటున్నా'అని గంగూలీ పేర్కొన్నాడు. విదేశాల్లో సిరీస్‌లు గెలవాలంటే బ్యాటింగ్‌లో సక్సెస్ అవ్వాలని దాదా అన్నాడు. బౌలర్లను ఎలా వాడుకుంటాడనేదానిపైనే భారత విజయావకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications