మరోసారి బాలినేని అసంతృప్తి: డీజీపీకి లేఖ.. వైసీపీలో కలకలం
ఒంగోలు: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వైఖరి కొనసాగుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయన తన అసంతృప్తిని బయటపెట్టారు. సొంత పార్టీకే చెందిన కొందరు నేతల తీరు, అధికార, పోలిసు యంత్రాంగం వ్యవహార శైలిని బాహటంగా వ్యతిరేకిస్తోన్నారు. ఈ క్రమంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పదవికీ రాజీనామా చేశారు.
తాజాగా మరోసారి తన అసమ్మతిని తెలియజేశారు బాలినేని. తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలిస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. దీనికి కారణం- ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ స్కాం కేసు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు తీరు పట్ల బాలినేని కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటోన్నారు.

ఈ కేసులో దర్యాప్తు సరిగ్గా సాగట్లేదని, దీన్ని వేగవంతం చేయాలంటూ మొన్నీ మధ్యే- జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కూ బాలినేని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఉదాసీనంగా వ్యవహరించొద్దని, సొంత పార్టీ నేతలు ఉన్నప్పటికీ వదిలిపెట్టొద్దని కోరారు. నకిలీ భూ డాక్యుమెంట్ల వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తుందని భావిస్తోన్నారు బాలినేని.
ఇప్పటికే పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ- ఫేక్ డాక్యుమెంట్ల స్కామ్ దర్యాప్తు వేగం పుంజుకోకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల తీరు పట్ల నిరసన తెలియజేస్తూ- తన గన్‌మెన్లను సరెండర్ చేశారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు. గన్‌మెన్లను సరెండర్ చేయడానికి గల కారణాలను వివరించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications