కచ్చులూరు ప్రమాద కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విడుదల చేసిన ఏపీ
కచ్చులూరు బోటు ప్రమాదంలో మృతుల కుటుంభాలకు ఏపీ ప్రభుత్వం ఎక్సిగ్రేషియా విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు ఒక్కోక్కరికి 10 లక్షల రుపాయాల చొప్పున మొత్తం 12 మందికి ఒక కోటి ఇరవైలక్షల రుపాయలను ఎక్స్‌గ్రేషియాను సీఎం సహాయనిధి నుండి విడుదల చేశారు.
ఎక్స్‌గ్రేషియా చెల్లించినవారిలో వరంగల్ జిల్లా కడిపికొండకు చెందిన తొమ్మిది ఉండగా జనగాం, ఖమ్మం, నల్గోండ జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. వీరందరికి 10 లక్షల చొప్పున ఏపీ ప్రభుత్వం విడుదల చేసి ఆ మొత్తం తెలంగాణ ప్రభుత్వం అకౌంట్‌లో జమ చేసి వారి ద్వార భాదిత కుటుంబాలకు అందించనుంది. కాగా మృతుల కుటుంబాలకు పదిలక్షల సహాయంతోపాటు అదనంగా జీవితాబీమా ద్వార మరో పదిలక్షల రూపాలయను బాధిత కుటుంబాలకు అందించనున్నారు. ఇక ప్రమాదం నుండి బయటపడిన వారికి కూడ లక్ష రుపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.

కచ్చులూరు ప్రమాదంలో తెలంగాణకు చెందినవారే ఎక్కువ మంది ఉన్న విషయం తెలిసిందే... ఇందులో హైదరాబాద్‌కు చెందిన వారు 22 మంది కాగా, వరంగల్‌కు చెందిన వారు 14 మంది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సహాయానికి అదనంగా తెలంగాణ కూడ ప్రభుత్వం కూడ ఐదు లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది. వీరి కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు.
సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 77 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా 51 మంది మృతి చెందారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications