సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి ప్రోటోకాల్ రగడ: సిద్దిపేటలో గవర్నర్, కలెక్టర్, సీపీ హాజరు, మిగతావారు నో

|
Google Oneindia TeluguNews

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆమెకు ప్రోటోకావల్ వివాదం కూడా అలా నడుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన తమిళి సై.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల ప్రభుత్వం పంపిణి యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లును పెండింగ్ లో పెట్టడంపై వివాదం నెలకొంది. ఇప్పటికే దీనిపై వివరణ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గవర్నర్ ఆదేశించారు. తనకు ఎలాంటి లేఖ అందలేదని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఆ లేఖను సీఎం కార్యాలయానికి పంపామని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి

మరోసారి ప్రోటోకాల్ రగడ..

మరోసారి ప్రోటోకాల్ రగడ..


గవర్నర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. తొలుత కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అయితే ఆమె వెంట కలెక్టర్, పోలీస్ కమిషనర్ మాత్రమే ఉన్నారు. ఇతర ఉన్నతాధికారులు పాల్గొనలేదు. దీంతో మరోసారి వివాదం రాజేసింది. ఇదివరకు వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా అధికారులు పట్టించుకోలేదు. యాదాద్రి, భద్రాచలంలో కూడా ఆమెకు చుక్కెదురై అయ్యింది.

మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా..

మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా..


మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గవర్నర్‌ను టార్గెట్ చేశారు. కానీ ఆమె మాత్రం ఓ ఇంటర్వ్యూ సందర్భంలో సీఎం కేసీఆర్‌ను అన్నయ్య అని పిలిచారు. అంతకుముందు గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్ సఖ్యంగా ఉండేవారు. ఆయన పాదాలకు నమస్కారం కూడా చేశారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ పాదాలకు ప్రణమిల్లారు. కానీ తమిళి సై సౌందరరాజన్ పట్ల మాత్రం కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో చూడాలీ.

వివాదం ఇలా

వివాదం ఇలా


తమిళి సై సౌందరరాజన్ తమిళనాడుకు చెందిన వారు.. అంతకుముందు బీజేపీలో క్రియాశీలక పాత్ర కూడా పోషించారు. ఆ తర్వాత గవర్నర్ పదవీని చేపట్టారు. నిజానికి సీఎం కేసీఆర్- గవర్నర్ తమిళి సై మధ్య పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడంతో వివాదం నెలకొంది. ఇక అప్పటినుంచి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. గవర్నర్ అధికార కార్యక్రమాలకు కూడా ప్రొటోకాల్ పాటించలేదు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. అదీ అలా కంటిన్యూ అవుతుంది.

English summary
protocol issue in governer tamili sai soundarajan. siddipeta tour not attend heigher officials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X