Solar Eclipse 2023: గ్రహణాల వెనుక అసలు కథ..తెలుసుకోకుంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం అంటే అశుభం అని చాలామంది నమ్మకం. అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ గ్రహణం మేషం, అశ్వినీ నక్షత్రాల్లో ఏర్పడుతుంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు 19 ఏళ్లకు ఒకసారి మేషరాశిలో సూర్యగ్రహణం వస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం అశుభకరమైనదిగా భావిస్తుండగా అదే సైన్స్ కోణంలో చూస్తే మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని నమ్ముతారు.
సైన్స్ ప్రకారం సూర్యగ్రహణం ఏమిటి..?
సైన్స్ ప్రకారం సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి చుట్టూ చంద్రుడు భ్రమిస్తాడు.సూర్యుడు, భూమి, చంద్రుడు సరళ రేఖలో వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. అయితే సూర్యుడిని చంద్రుడు కప్పేసి ఆ కిరణాలు లేదా కాంతిని భూమికి చేరకుండా చేసే ప్రక్రియను సూర్యగ్రహణం అంటారు.

పురాణాలు ఏం చెబుతున్నాయి..?
సూర్యగ్రహణం లేదా చంద్ర గ్రహణం సంభవించేందుకు కారణం సముద్ర మథనంతో ముడిపడి ఉందని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు రాక్షసులు సముద్ర మథనం చేయడం ద్వారా అమృతం వస్తుంది. అయితే ఈ అమృతాన్ని ఎవరు సేవించాలనేదానిపై వాగ్వాదం జరుగుతుంది.అప్పుడు మోహినీ రూపంలో దర్శనమిచ్చిన శ్రీమహావిష్ణువు అమృతం తాగే అవకాశం దేవతలకు ప్రసాదించాడు.
అయితే దేవతల వరుసలో ఒక అసురుడు కూర్చుని అమృతాన్ని సేవిస్తాడు. ఇది గుర్తించిన సూర్య చంద్రులు మహావిష్ణువుకు విషయాన్ని చేరవేస్తారు. దీంతో విష్ణువు అమృతం సేవించిన రాక్షసుడిని సుదర్శన చక్రంతో శిరచ్ఛేదం చేస్తాడు. రాక్షసుడి తల భాగాన్ని రాహువు , మొండెం భాగాన్ని కేతువు అని అంటారు. ఈ సంఘటన తర్వాత సూర్యచంద్రులు రాహువు కేతువులకు శతృవులుగా మారుతారు. రాహువు కేతువులు సూర్య చంద్రులను తినేస్తారు. దీనినే గ్రహణం అంటారు.

గ్రహణంతో వచ్చే నెగిటివ్ ఎనర్జీ-పరిష్కారం:
* సూర్యగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు రావద్దు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు
* గ్రహణ సమయంలో ఎక్కువగా మంత్రాలను జపిస్తూ దేవతలను స్మరించాలి
* గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి
* సూర్యగ్రహణం సమయంలో పూజలు, యాగాలు, హోమాలు చేయరాదు
* గ్రహణం కంటే ముందు తులసి ఆకులను మీరు తీసుకోబోయే ఆహారం, పానీయాలపై ఉంచడం మంచిది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications