యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్‌తో భాగస్వామిగా అపోలో యూనివర్శిటీ-అడ్మిషన్స్ ప్రారంభం..!!
మీ పిల్లలను విదేశాల్లో ఉన్నత చదువులు చదివించాలని ఆశపడుతున్నారా..? మంచి బ్రాంచ్‌లో పిల్లలను చదివించి వారు ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడాలని భావిస్తున్నారా.. అయితే అతి తక్కువ ఫీజుతోనే మీ కలలను సాకారం చేస్తోంది అపోలో యూనివర్శిటీ. అవును ఇది నిజం. ఉన్నత విద్యను లేదా మంచి ప్రొఫెషనల్ కోర్సులను చదివించాలనుకునే తల్లిదండ్రుల కలలను నెరవేర్చే బాధ్యత ది అపోలో యూనివర్శిటీ తీసుకుంది. యూకేలో పేరుగాంచిన టాప్ యూనివర్శిటీల్లో ఒకటిగా ఉన్న యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్‌తో మన అపోలో భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలోనే మన పిల్లలను నేరుగా యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్‌లో చదువుకునేందుకు అది కూడా అతి తక్కువ ఫీజుతోనే చదివించే బాధ్యతను అపోలో యూనివర్శిటీ తీసుకుంది.
అపోలో యూనివర్శిటీ గురించి...
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ యూనివర్శిటీ అపోలో యూనివర్శిటీ. ఇక్కడ వివిధ రంగాల్లో చక్కటి కోర్సులను అందిస్తూ మన్ననలు పొందింది. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగం,హెల్త్ కేర్ రంగం, మేనేజ్‌మెంట్ మరియు సోషల్ సైన్సెస్‌లో కోర్సులను అందిస్తూ విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషిస్తోంది. ముఖ్యంగా ఈ యూనివర్శిటీలో పరిశోధనతో కూడిన వాతావరణం ఉండటం వల్ల విద్యార్థులు కూడా బయటకు వచ్చే సమయానికి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేందుకు సిద్ధంగా ఉంటారు.

యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ గురించి..
లీసెస్టర్ యూనివర్శిటీ గురించి చెప్పాల్సి వస్తే యూకేలోని టాప్ యూనిర్శిటీలో ఇది కూడా ఒకటిగా నిలుస్తోంది. ఎంతో మందిని ప్రపంచ మేధావులను ఈ యూనివర్శిటీ తీర్చిదిద్దింది. జీవితాలను ప్రభావితం చేసే ఎన్నో అంశాలను ప్రపంచానికి పరిశోధనల ద్వారా తెలియజేసిన విశ్వవిద్యాలయం లీసెస్టర్ యూనివర్శిటీ. 2023 డిసెంబర్‌లో స్టూడెంట్స్ టీచింగ్ ఎక్సెలెన్స్ ఫ్రేమ్‌వర్క్(TEF) విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్‌కు గోల్డ్ రేటింగ్ వచ్చింది. అంటే ఈ యూనివర్శిటీలో విద్యనభ్యసించే విద్యార్థులు కచ్చితంగా ప్రయోజకులవుతారనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యూనివర్శిటీలో వివిధ రకాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేల్ కోర్సులు, రీసెర్చ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్‌లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో పాటు చక్కటి రీసెర్చ్ కేంద్రాలు ఉండటం, వివిధ రంగాలకు చెందిన స్కాలర్స్ మరియు విద్యార్థులు ఉండటం, అదే సమయంలో ఇండస్ట్రీలతో చక్కటి అనుబంధం కలిగి ఉండటం కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. ఈ యూనివర్శిటీలో 20వేలకు పైగా విద్యార్థులు, 4వేలకు పైగా బోధనా సిబ్బంది ఉన్నారు. విజయానికి మారుపేరు,వివిధ రంగాల్లో సాధించిన ఘనతలే యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ గురించి చెప్తాయి.
నేటి టెక్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎలా ఉందో, దానికి బయట ఇండస్ట్రీలో ఎంతటి డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్‌లను ప్రత్యేక ప్రోగ్రామ్స్‌గా అందిస్తోంది. విద్యార్థులను డేటా ప్రొఫెషనల్స్‌గా తీర్చి దిద్దే బాధ్యత ఈ యూనివర్శిటీ తీసుకుంది.
అడ్మిషన్ ప్రక్రియ
- యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్‌లో చదువుకోవాలనే విద్యార్థులకు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
- ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఎంపీసీ బ్రాంచ్‌లో అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీల్లో 60శాతం మార్కులు సాధించి ఉండాలి
- ఇంగ్లీషులో 70శాతం మార్కులు తప్పనిసరి
- గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ప్రధాన సబ్జెక్టులుగా 12వ తరగతి లేదా ఇంటర్మీడియెట్ పాసై ఉండాలి
- ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి లేదా చివరి సంవత్సరంలో ఉండాలి
- 2025 డిసెంబర్ 31 నాటికి విద్యార్థి వయస్సు 17 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
- అర్హులైన విద్యార్థులకు 25శాతం స్కాలర్షిప్‌లు కూడా లభిస్తాయి.
ఫీజు విషయానికొస్తే సెమిస్టర్‌కు రూ.1.75 లక్షల మాత్రమే ఉంటుంది. యూకే ట్యూషన్ ఫీజు మరియు తొలి రెండేళ్లకు అయ్యే ఖర్చును దాదాపుగా 90శాతం ఆదా చేసుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం.. ది అపోలో యూనివర్శిటీ అండ్ యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్‌లో అడ్మిషన్ పొంది మీ బంగారు భవిష్యత్తుకు బాటలు మీరే వేసుకోండి. ఇక పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://www.apollouniversity.edu.in/university-of-leicester/
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications