అల్లు అర్జున్ ప్రస్తుత దరిద్రానికి అసలు కారణమిదే!
ఇప్పటివరకు ఏ స్టార్ హీరోకి రాని కష్టం అల్లు అర్జున్ కు వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన కేసులో నిందితుడిగా ఆ కేసులో నుంచి బయటపడటం కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకపక్క పుష్ప 2 సినిమా సక్సెస్ సాధించి బాక్సాఫీస్ ల వద్ద దూసుకుపోతున్న వేళ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేని దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
అల్లు అర్జున్ దరిద్రం పైన సోషల్ మీడియా పోస్టులు
ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన చంచల్ గూడా జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ సాధారణ బెయిల్ కోసం కోర్టుకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. అసలు జీవితంలోనే ఊహించని విధంగా అల్లు అర్జున్ ప్రస్తుత కాలంలో అనుభవిస్తున్న దరిద్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు తీవ్ర ఆవేదన కలిగిస్తుంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ దరిద్రం పైన పోస్ట్ లు హల్చల్ చేస్తున్నాయి.

11 నంబర్ పై అల్లు అర్జున్ పై ఆసక్తికర పోస్టులు
ఇక ఆసక్తికరంగా వైరల్ అవుతున్న ఒక పోస్ట్ లో అల్లు అర్జున్ వెనుక 11 అనే దరిద్రం ఉందని చెబుతున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ 11 గా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఈ 11 కు అల్లు అర్జున్ కు, అనవసరమైన చర్చలకు కారణం అవుతున్న పలు సంఘటనలకు ఉన్న లింక్ చెప్పిన నెటిజెన్లు ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
మే 11న నంద్యాల వెళ్లి వైసీపీకి ప్రచారం
అల్లు అర్జున్ మే 11వ తేదీన నంద్యాల వెళ్ళాడని అప్పుడు మొదలైన దరిద్రం నేటికీ 11 పేరుతో కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. నంద్యాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో రాజకీయ దుమారం చెలరేగగా, మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదాలు ఆ తర్వాత బయటకు వచ్చాయి.
సంధ్యా థియేటర్ ఘటనకు 11కు లింక్
ఇక ఈ సందర్భంగా నంద్యాలలో ఆయన పర్యటనకు అనుమతులు లేకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలు, మోటార్ సైకిల్స్ తో ర్యాలీ నిర్వహించడం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇటీవల సంధ్య థియేటర్లో జరిగిన ఘటన కూడా 11 గంటలకు జరిగింది. సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా 11 గంటలకు జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది.
కేసులో ఏ 11.. విచారణకు ఆ సమయం.. వైరల్ పోస్ట్
ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఏ 11 గా అల్లు అర్జున్ ను చేర్చిన పోలీసులు ఆయనను ఉదయం 11 గంటలకు రమ్మని నోటీసులలో పేర్కొన్నారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నీ వెనుక 11 అనే దరిద్రం ఉంది అది పోతే గాని నువ్వు గట్టెక్కవ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications