తెలంగాణలో కొత్తగా 1200కుపైగా కరోనా కేసులు, 15 మరణాలు: జిల్లాలవారీగా కొత్త కేసులివే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 91,621 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 1280 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,03,369కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఆదివారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది.

Recommended Video

    Niti Aayog On Covid Vaccination Drive పారదర్శక పద్ధతిలోనే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు!

    శనివారం కరోనాతో 15 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3484కు చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2261 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,78,748కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,137 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 95.91 శాతంగా ఉంది. మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.

    1280 new corona cases, 15 deaths reported in telangana state, in last 24 hours

    రాస్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 04, భద్రాద్రి కొత్తగూడెంలో 69, జీహెచ్ఎంసీలో 165. జగిత్యాలలో 24, జనగామలో 08, జయశంకర్ భూపాలపల్లిలో 16, జోగులాంబ గద్వాలలో 14, కామారెడ్డిలో 01, కరీంనగర్ లో 74, ఖమ్మంలో 156, కొమురంభీం ఆసిఫాబాద్ లో 05, మహబూబ్‌నగర్‌లో 40, మహబూబాబాద్‌లో 52, మంచిర్యాలలో 35, మెదక్‌లో 05, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 49, ములుగులో 12, నాగర్ కర్నూలులో 14, నల్గొండలో 80, నారాయణపేటలో 05, నిర్మల్‌లో 04, నిజామాబాద్‌లో 17, పెద్దపల్లిలో 48, రాజన్న సిరిసిల్లలో 14, రంగారెడ్డిలో 76, సంగారెడ్డిలో 38, సిద్దిపేటలో 46, సూర్యాపేటలో 59, వికారాబాద్ లో 25, వనపర్తిలో 18, వరంగల్ రూరల్ లో 29, వరంగల్ అర్బన్‌లో 55, యాదాద్రి భువనగిరిలో 23 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+