వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14 ఓకే..! మ‌రో మూడు సీట్ల పై క‌స‌ర‌త్తు..! రేపు హైద‌రాబాద్ రానున్న చంద్ర‌బాబు..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్య‌ర్థుల జాబితా సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. టిడిపి నేత‌లు బాబుతో భేటీ అయ్యేందుకు అమ‌రావ‌తి కి వెళ్ల‌డం కీల‌క నేత‌లు బాబుతో పాటే బెంగుళూరు వెళ్ల‌డంతో జాబితా రెడీ అయిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన వెంట‌నే దేశం నేత‌లు కూడా జాబితాను విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా త‌ర్వాత‌..! టిడిపి అభ్య‌ర్థుల జాబితా..!!

కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా త‌ర్వాత‌..! టిడిపి అభ్య‌ర్థుల జాబితా..!!

తెలంగాణాలో ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు మ‌హా కూట‌మిలో క‌లిసి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ... అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ 14 నుంచి 18 స్థానాలు పోటీ చేసే అవ‌కాశం ఉంద‌న్న ధీమాతో అందుకు అనుగుణంగా నియోజ‌క‌వ‌ర్గాలు, అభ్య‌ర్థుల జాబితాను పార్టీ సిద్ధం చేసింది. 119 స్థానాల్లో మెజార్టీ స్థానాలు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్య‌ర్థులపై ముమ్మ‌రంగా క‌స‌ర‌త్తు చేస్తున్న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా స్పీడు పెంచింది. కూట‌మిలో భాగంగా పార్టీకి కేటాయించే స్థానాల్లో అభ్య‌ర్థుల‌పై దృష్టి పెట్టింది.

ఆశావాహుల్లో తొల‌గ‌ని ఉత్కంఠ..! రేపు హైద‌రాబాద్ రానున్న బాబు..!!

ఆశావాహుల్లో తొల‌గ‌ని ఉత్కంఠ..! రేపు హైద‌రాబాద్ రానున్న బాబు..!!

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణా నేత‌లే జాబితాపై క‌స‌ర‌త్తు చేసినా, తాజాగా పార్టీ జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు ముందుకు తెలంగాణా అభ్య‌ర్థుల జాబితా వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అమ‌రావ‌తి వెళ్లిన సీన‌య‌ర్ నేత‌లు తాము సిద్ధం చేసిన జాబితాను బాబు అంద‌చేసిన‌ట్లు తెలుస్తోంది. జాబితాపై తుది నిర్ణ‌యం చంద్ర‌బాబు తీసుకోవాల్సి ఉంటుంది. 14 స్థానాలు కేటాయిస్తున్న‌ట్లు కాంగ్రెస్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో తెలుగుత‌మ్ముళ్ల‌లో అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. బాబు చొర‌వ తీసుకుంటే మ‌రికొన్ని స్థానాల్లో కూడా పోటీ చేసే అవ‌కాశం ద‌క్కుతుంద‌న్న ధీమా టిడిపి నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది.

కొంద‌రి అభ్య‌ర్థుల్లో కొన‌సాగుతున్న‌స‌స్పెన్స్..!

కొంద‌రి అభ్య‌ర్థుల్లో కొన‌సాగుతున్న‌స‌స్పెన్స్..!

14 స్థానాలు కేటాయిస్తున్న‌ట్లు కాంగ్రెస్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో తెలుగుత‌మ్ముళ్ల‌లో అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. బాబు చొర‌వ తీసుకుంటే మ‌రికొన్ని స్థానాల్లో కూడా పోటీ చేసే అవ‌కాశం ద‌క్కుతుంద‌న్న ధీమా టిడిపి నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. అద‌నంగా మ‌రిన్ని స్థానాల‌పై కూడాపార్టీ నేత‌లు క‌స‌ర‌త్తు పూర్తి చేశారు. మ‌రో రెండు మూడు స్థానాల‌ను టీడిపి కి కేటాయించేందుకు కాంగ్రెస్ అదిష్టానం సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌టి రెండు రోజుల్లో ఈ సీట్ల‌పై కూడా స్ప‌ష్ట‌త రానుంది.

తాజాగా పార్టీ ప్ర‌తిపాదిస్తున్న స్థానాలు, అభ్య‌ర్థుల వివ‌రాలు..

తాజాగా పార్టీ ప్ర‌తిపాదిస్తున్న స్థానాలు, అభ్య‌ర్థుల వివ‌రాలు..

శేరిలింగంప‌ల్లి......................................... భ‌వ్యా అనంద్ ప్ర‌సాద్ లేదా మువ్వా స‌త్యానార‌య‌ణ‌
కూక‌ట్ ప‌ల్లి............................................ మందాడి శ్రీ‌నివాస్ రావ్ లేదా కాపు సంఘం నేత‌
ఉప్ప‌ల్...................................................వీరేంద‌ర్ గౌడ్
సికింద్రాబాద్............................................కూన వెంక‌టేశ్ గౌడ్
రాజేంద్ర‌న‌గ‌ర్.................................. .........గ‌ణేష్ గుప్తా లేదా బుక్క వేణుగోపాల్
ఖైరాతాబాద్..............................................లంకాల దీప‌క్ రెడ్డి
ప‌ఠాన్ చెరువు......................................... శ్రీ‌కాంత్ గౌడ్ లేదా నందీశ్వ‌ర్ గౌడ్
స‌త్తుప‌ల్లి...................................................సండ్ర వీర‌య్య‌
అశ్వారావ్ పేట‌...........................................మ‌చ్చా వెంక‌టేశ్వ‌ర్ రావ్
ఖ‌మ్మం..................................................... నామా నాగేశ్వర్ రావ్
కోదాడ‌.....................................................బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్
మ‌క్త‌ల్.......................................................కొత్త కోట ద‌యాక‌ర్ రెడ్డి
మ‌హ‌బూబ్ న‌గ‌ర్.......................................ఎర్ర శేఖ‌ర్
ప‌ర‌కాల ...................................................రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి
నిజామాబాద్ రూర‌ల్.................................. మండ‌వ వెంక‌టేశ్వ‌ర్ రావ్

English summary
The Telangana Telugu desam Party seems to have prepared a list of Assembly candidates. TDP leaders go to Amravati to meet with Babu. The party sources predict that the list will be ready when the key leaders go to Bangalore with babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X