Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుందా..? ఇదే సూపర్ ఛాన్స్..!

సొంతింటి కలను సాకారం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకునేవారికి ఇది సూపర్ ఛాన్స్.. తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన 163 ప్లాట్లకు బహిరంగ వేలంపాట జరగనుంది. బహదూర్ పుర్, తొర్రూర్, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని ఈ ప్లాట్లను నవంబర్ 17,18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం ధ్రువీకరించారు.

ఈ మేరకు అవుటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని తొర్రూర్ లో 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 125 ప్లాట్లను పెద్ద అంబర్ పేటలోని అవికా కన్వెన్షన్ లో నవంబర్ 18 మధ్యాహ్నం నుంచి వేలంపాట నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే కుర్మల్‌ గూడలో 200 నుంచి 300 చదరపు గజాల విస్తీర్ణంలోని 25 ప్లాట్లు, బహదూర్‌ పల్లిలో 200 నుంచి 1000 గజాల విస్తీర్ణంలోని 13 ప్లాట్ల విక్రయానికి సైతం నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ప్రాంతాల్లో గజం ప్రారంభ ధర రూ. 25 వేల నుంచి రూ. 30 వేలుగా ఉంది. ఇక తొర్రూర్ ఔటర్ రింగ్ రోడ్డు, ఆదిబట్ల ఐటీ కారిడార్ కు సమీపంలో ఉంది. అలాగే బహదూర్ పల్లి ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉంటుంది. కుర్మల్ గూడ.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉంటుంది. ఆర్సీఐ అండ్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉంటుంది. ఆసక్తి కలిగిన వాళ్లు అధికారిక వెబ్ సైట్ ను తెలంగాణ రాజీవ్ స్వగ్రూహ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలని పేర్కొంది.

163 Rajiv Swagruha Plots Up for Public Auction in Thorrur Bahadurpally amp amp Kurmalguda Nov 17 18

ఇక ఈ ఓపెన్ ప్లాట్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టం అవుతోంది. తొర్రూర్ లోని ప్రాజెక్ట్ సైట్‌లోని ప్లాట్ లను స్వయంగా చూసి.. పక్కన లే అవుట్ లోని నివాసితుల అభిప్రాయాలు తెలుసుకుని, మౌలిక సదుపాయాలను విశ్లేషించి.. వాస్తు చూసుకుని మరీ కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తొర్రూర్ లే అవుట్‌ లో ఉన్న 885 ప్లాట్లలో విడతల వారీగా ఇప్పటివరకు 517 ప్లాట్లను విక్రయించారు. ప్రస్తుతం 125 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+