KA Paul: త్వరలోనే 25 మంది సినీ సెలబ్రిటీలు అరెస్ట్!.. లేదంటే వారిని సుప్రీంకోర్టుకీడుస్తా..

KA Paul: ప్రస్తుతం సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. త్వరలోనే విజయ్ దేవరకొండ, బాలకృష్ణ సహా 25 మంది అరెస్ట్ అవుతారని కేఏ పాల్ ఓ వీడియోలో వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వినిపిస్తున్న వాళ్లంతా స్వతహాగా బయటకు వచ్చి 72 గంటల్లో క్షమాపణలు చెప్పాలని కేఏ పాల్ గడువు విధించారు. 72 గంటల్లో చేసిన తప్పు ఒప్పుకోవాలని.. లేదంటే అందరిని సుప్రీంకోర్టుకు ఈడ్చుతానంటూ స్టార్ క్రికెటర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులకు కేఏ పాల్ హెచ్చరించారు.

ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలపై కేసు నమోదైంది. వారిలో కొందరిని పోలీసులు విచారించారు. ఈ కేసులో స్టార్ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ తో పాటు ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్ పేర్లు వినిపిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గడువు విధిస్తూ హెచ్చరించడం గమనార్హం. ఈ మేరకు వీడియో విడుదల చేసిన కేఏ పాల్.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ ప్రముఖులపై తీవ్రంగా మండిపడ్డారు. స్టార్ క్రికెటర్ సచిన్ కు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అవసరమా అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.

25 Celebrities including Vijay Deverakonda and Balakrishna to be Arrested Soon Says KA Paul

ఇదిలా ఉండగా 25 మంది బడా సినీ సెలెబ్రిటీలు అరెస్ట్ కానున్నారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, రానా, మంచు లక్ష్మీ లాంటి 25 మంది సినీ ప్రముఖులు అతి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారని కేఏ పాల్ జోస్యం చెప్పడం గమనార్హం. రాజకీయ నాయకులు, స్టార్ల దగ్గర డబ్బులు తీసుకుని అరెస్ట్ చేయకపోతే వాళ్లందరినీ సుప్రీంకోర్టుకు ఈడుస్తునంటూ కేఏ పాల్ హెచ్చరించారు. ప్రకాశ్ రాజ్ లాగా తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పకపోతే.. ఎవరినీ వదిలేది లేదని కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వీళ్లంతా నరహత్యకు పాల్పడ్డారని.. అమితంగా అభిమానించే వారికి మీరిచ్చే బహుమతి ఇదేనా అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+