తెలంగాణలో మరో 41 పాజిటివ్ కేసులు, 117 మంది డిశ్చార్జ్.. మొత్తం 1367 మంది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం 31, ఆదివారం 33 కాగా.. సోమవారం 79 పాజిటివ్ కేసులు, మంగళవారం 51 కేసులు రికార్డయ్యాయి.

 41 positive cases are register in telangana state

బుధవారం 41 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1367కి చేరింది. వ్యాధి నుంచి కోలుకుని 939 మంది డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం 117 మంది ఇంటికి పంపించారు. ప్రస్తుతం 394 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ పాజిటివ్ కేసులు 31 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా.. 10 మంది వలసకూలీలు అని అధికారులు పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకి బుధవారం మరో ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 34కి చేరింది.

Recommended Video

    AP CM YS Jagan Review Meeting On Coronavirus Pandemic @ Tadepalli

    వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదు. గత 14 రోజుల్లో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట్, వరంగల్ అర్బన్, జనగామ, గద్వాల, నిర్మల్ జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ బులెటిన్‌లో అధికారులు పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+