Viral Video: పాలకుర్తిలో ఎలుగుబంటి హల్ చల్.. వైరల్ అయిన వీడియో..
ఈ మధ్య వన్యప్రాణులు అడవులను వదిలేసి జనారణ్యంలోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి చేయడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపింది. తాజాగా తెలంగాణలలోని జనగామ జిల్లాలో ఎలుబంటి హల్ చల్ చేసింది.
రోడ్డుపై ఎలుగుబంటి..
జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ ఎలుగుబంటి రాత్రి రోడ్లపై తిరిగింది. ఎలుగుబంటి రోడ్లపై సంచరిస్తుండడం చూసి కొందరు వీడియో తీశారు. ఎలుగుబంటి తిరుగుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రెండు రోజుల క్రితం ఎలుగుబంటి సంచరించింది. అక్కడి ప్రజలు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తొర్రూరులో ఎలుగుబంటి కోసం ఎంత శ్రమించినా దొరకలేదు.

ఆ ఎలుగుబంటే ఇది..
నిన్న రాత్రి అదే ఎలుగుబంటి పాలకుర్తిలో ప్రత్యక్షమైనట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే వెంటనే ఎలుగుబంటిని పట్టుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు కోరుతున్నారు. ఎలుగుబండి ఎప్పుడు ఎక్కడికి వస్తుంతో తెలియక ఆందోలన చెందుతున్నారు.
పాలకుర్తిలో ఎలుగుబంటి హల్ చల్.. వైరల్ అయిన వీడియో..#Bear #Telangana pic.twitter.com/Bn4PiJ4OS6
— oneindiatelugu (@oneindiatelugu) July 28, 2022












Click it and Unblock the Notifications