Car Accident: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు గల్లంతు..

కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. శివారెడ్డి పేట్ లో ఓ కారు పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతయ్యారు. హైదరాబాద్ కు చెందిన ఐదుగురు స్నేహితులు వికారాబాద్ అనంతగిరి హిల్స్ చూసేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరారు. సోమవారం తెల్లవారుజామునే వారు అనంతగిరికి కారులో పయనమయ్యారు.

తెల్లవారుజామును దట్టంగా పొగమంచుకు కుమ్ముకుని ఉండడంతో రోడ్డు సరిగా కనిపించలేదు. అయినా వారు కారును ముందు తీసుకెళ్లారు. శివారెడ్డిపేట శివారు చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అయితే వారిలో ఒకరికి ఈత రావడంతో ముగ్గురిని కాపాడగలిగాడు. కానీ మరో స్నేహితుడు మాత్రం కారుతోనే చెరువులో మునిగిపోయాడు. వారు వెంటనే స్థానికులను అప్రమత్తం చేశారు.

A car plunged into a lake in Vikarabad district

స్థానికంగా ఉన్న ఈతగాళ్లు గల్లంతైన వ్యక్తి కోసం గాలించారు. ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ప్రమాదం నుంచి బయటపడిన నలుగురిని చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో పూజిత, రఘు, సాగర్, మోహన్ లు క్షేమంగా బయటకొచ్చారు.

గుణశేఖర్ అనే వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేని పోలీసులు తెలిపారు. అతని కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పొంగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక అదుపుతప్పి కారు చెరువులోకి దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+