Dengue: పంజా విసురుతోన్న డెంగీ.. నాలుగు నెలల గర్భిణి మృతి..

తెలంగాణపై డెంగీ పంజా విసురుతోంది. తాజాగా డెంగీ(Dengue)తో నాలుగు నెలల గర్భిణి చనిపోయింది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ములుగు జిల్లా మంగపేట్ మండలం బోరునర్సాపూర్ గ్రామానికి చెందిన జక్కం రమ్య, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతరు పావనికి రెండు సంవత్సరాల క్రితం ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు గ్రామానికి చెందిన విజయ్ తో వివాహం జరిగింది. పావని ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా ఉంది. అయితే పావనికి మూడు రోజుల పాటు జ్వరం రావడంతో తల్లదండ్రులు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ వైద్య పరీక్షలు చేయగా.. డెంగీ వచ్చినట్లు తేలింది. దీంతో పావనిని వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పావని చికిత్స పొందతూ మంగళవారం కన్నుమూసింది. డెంగీ పెద్దలకే కాదు పిల్లలకు కూడా వస్తోంది. రాష్ట్రంలో డెంగీ కేసులు క్రమంగా పెరుగుతోన్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నారులు వైరల్ ఫీవర్, డెంగీ, విష జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. హైదరాబాద్ లోని చిన్న పిల్లల ఆస్పత్రి అయిన నిలోఫర్ కు రోజు 25 నుంచి మంది పిల్లలు వైరల్ ఫీవర్ తో వస్తున్నారట.

A four-month pregnant woman died of dengue fever in Hyderabad

వారికి పరీక్షలు నిర్వహిస్తుండా.. కనీసం 5 నుంచి ఆరుగురు పిల్లలకు డెంగీ వస్తున్నట్లు తెలుస్తోంది. అటు జిల్లాల్లో కూడా డెంగీ విజృంభిస్తోంది. కరీంనగర్ జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డయాగ్నస్టిక్ సెంటర్ల సమాచారం ప్రకారం వారం క్రితం వరకు 106 డెంగీ కేసులు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. అటు పెద్దపల్లి జిల్లాలో డెంగీ కేసులు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోనూ 100కు పైగా డెంగీ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాలో కూడా డెంగ్యూ కేసులు వస్తున్నాయి. పెద్దవారికి కంటే పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో వారే ఎక్కువ డెంగ్యూ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలో ఆదివారం ఆద్యంత్​అనే బాలుడు డెంగీ చనిపోయాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దొద్దిగూడెంకు చెందిన కుడిమేత జలపతి అనే బాలుడు డెంగీతో మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పెనుగొండ ఆద్యశ్రీ డెంగీతో ప్రాణలు విడిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+