Intinti kutumba Survey: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వే.. అడిగే ప్రశ్నలివే..!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కుల గణన సర్వే చేపట్టనుంది. నేటి ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించారననున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధవారం నుంచి శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. ఈ సర్వేలో ప్రజల సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ వివరాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేకు సంబంధించి 75 ప్రశ్నలతో ఫార్మాట్ తయారు చేశారు. ఈ రెండు పార్టులుగా ఈ ప్రశ్నలు ఉండనున్నాయి.
పార్టు-1లో 60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్, పుట్టిన తేదీ, చదువు పలు వ్యక్తిగత వివరాలు అడుగుతారు. ఇక పార్టు-2లో కుటుంబ ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతారు. మొదటగా.. ఇళ్లకు స్టిక్కరింగ్ చేస్తారు. ఈ సర్వేలో భాగంగా ఒక్కోక్క ఎన్యూమరేటర్ కు 150 ఇళ్లు కేటాయించారు. సర్వే చేసే వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల సిబ్బంది ఉన్నారు. సర్వే లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు ఆదివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో కూడా పని చేయాల్సి ఉంటుంది.

సేకరించే వివరాలు..
ఆధార్ వివరాలు కచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఆధార్ గురించి ప్రజలకు వివరించి నంబర్ తీసుకోవాలని ఎన్యూమరేటర్లకు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు ఎంత మంది నివసిస్తున్నారు అనేది కూడా సర్వేలో వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం సర్వే పత్రంలో మాతృభాష కాలమ్ ఉంది. వీటికోసం 19 రకాల కోడ్‌లు కేటాయించారు. తమిళం, మలయాళం, కన్నడ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల మాతృభాషలే కాదు. లంబాడీ, కోయ, గోండు లాంటి ఆదివాసీలు, గిరిజనులు మాట్లాడే మాతృభాషల వివరాలూ నమోదు చేయనున్నారు.
దివ్యాంగులకు సంబంధించి కూడా వివరాలు సేకరించనున్నారు. వారి వైకల్యం తీవ్రత, కండరాల క్షీణత, యాసిడ్ బాధితులు, మరుగుజ్జు, ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్, నత్తి, మానసిక అనారోగ్యం, పార్కిన్‌సన్, తలసీమియా తదితర 13 రకాల వైకల్యాల వివరాలు సేకరించనున్నారు.అలాగే కుటుంబ సభ్యులు ఫోన్ నంబర్ కూడా తెలుసుకోనున్నారు. పెళ్లై అయిన వారి వివరాలు, పెళ్లి కానీ వివరాలు కూడా సేకరించనున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాల్లో చదివే విద్యార్థులకు సంబంధించి కూడా సమాచారం తెలుసుకోనున్నారు.
పాఠశాల మానేసి విద్యార్థులు, ప్రస్తుతం చదుతువున్న విద్యార్థులు, చదువు పూర్తయిన వారు. చదువు పూర్తై ఉద్యోగం చేస్తున్న వారి వివరాలు సేకరించనున్నారు.వార్షిక ఆదాయం, ఆదాయపు పన్ను చెల్లింపులు గురించి కూడా తెలుసుకోనున్నారు. వ్యవసాయం, బీడీ, హోటల్, కార్ఖానా, హమాలీ, ఉపాధి హామీ, గనుల కూలీలు, ఇటుక బట్టీ కార్మికుల వివరాలకు కూడా సేకరించనున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి పొందిన సంక్షేమ పథకాల వివరాలు, రాజకీయ నేపథ్యం లాంటి వివరాలు సేకరించనున్నారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లిన వారి వివరాలు సర్వేలో తెలుసుకోనున్నారు.












Click it and Unblock the Notifications