Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సౌందర్య ఆత్మహత్య: జీవితం అనుకున్నట్లుగా ఉండట్లేదనే..

హైదరాబాద్: శంషాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. సౌందర్య అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన గాజుల సౌందర్య మూడేళ్లుగా కొండాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 2న మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజినీర్ అభినవ్‌తో పెళ్లి జరిగింది.

ఈ క్రమంలో జూన్ 8న సాయంత్రం భర్త అభినవ్‌తో పాటు మామకు ఫోన్ చేసింది సౌందర్య. తాను దూరంగా వెళ్లిపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేసింది. కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేసి.. శంషాబాద్‌లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి దూకుతున్నట్లు భర్తకి ఫోన్ చేసి చెప్పింది సౌందర్య.

 techiecommitedsucide

దీంతో అభినవ్ వెంటనే డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు విషయం చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే భవనంపై నుంచి దూకిన సౌందర్య రక్తపు మడుగులో పడివుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్న సౌందర్య ఆదివారంనాడు మృతి చెందింది.

పోస్టుమార్టం అనంతరం సౌందర్య మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు శంషాబాద్ పోలీసులు. శంషాబాద్‌లోని అర్కాన్ ఆస్పత్రి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఊహించుకున్నట్లుగా జీవితం ఉండటం లేదని తరచూ ఫ్రెండ్స్‌తో చెప్పినట్లు తెలిసింది. ఇటీవలే ఉద్యోగం కోల్పోయిన భర్త ఇంటి వద్దే ఉంటున్నాడని.. ఊహించుకున్నట్లుగా లైఫ్ లేదనే మనస్తాపంతో సౌందర్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+