Telangana Polls: రాష్ట్రంలో భారీగా పట్టుబడుతున్న డబ్బు..

ప్రస్తుతం.. రాజకీయాలు చేయాలంటే.. డబ్బు ఉండాల్సిందే.. డబ్బు లేకుంటే అస్సలే రాజకీయాలు చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా తెలంగాణ ఎన్నికలు దేశంలోనే ఖరీదైన ఎన్నికలుగా మారనున్నాయి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు అక్టోబర్‌ 9 నుంచి నవంబర్‌ 25 మధ్య రూ.709కోట్ల 56లక్షల 12వేల 177 విలువైన నగదుతో పాటు ఉచితంగా అందించాడానికి సిద్ధంగా ఉన్న వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నవంబర్ 25న దాదాపు రూ.10 కోట్లు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. 51,315 కిలోల నల్లబెల్లం, 3,404 కిలోల 113.5 లీటర్ల పటికను స్వాధీనం చేసుకున్నారు. శనివారం 34లక్షల 71వేల 850 చీరలతో రూ.83కోట్ల 8లక్షల 69వేల 146 విలువైన ఉచితాలను పోలీసులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2లక్షల 96వేల 595 కిలోల బియ్యం, 9వేల 207 కుక్కర్లు, 88వేల 797 చీరలు, 7 ద్విచక్ర వాహనాలు, 10 నాలుగు చక్రాల వాహనాలు, 18వేల 566 గడియారాలు, 72వేల 473 మొబైల్‌లు, 6వేల 313 ఫ్యాన్లు, 151 కుట్టు మిషన్లు, 362 లంచ్ బాక్సులు, 15వేల 858 ఇమిటేషన్ జ్యువెల్లరీ, లక్షా 41వేల 478 వస్త్రాలు, 3,854 టీ-షర్టులు, 40 టెలివిజన్ సెట్‌లు కూడా పట్టుబడ్డాయి.

A lot of money is being seized in Telangana in the wake of the elections

ఇంత డబ్బు పట్టుబడ్డా చాలా చోట్ల ఓటు కోసం డబ్బు పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గాలను బట్టి ఓటుకు వెల కడుతున్నారు. కొన్ని చోట్ల ఓటుకు రూ.5 వేలు ఇస్తుంటే.. మరికొన్ని చోట్ల ఓటుకు రూ. 2 వేల నుంచి రూ.3 వేలు పంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మోహన్ రావు నగర్ కాలనీలో మల్లారెడ్డి కాలేజ్ సిబ్బంది ఇంటింటికి డబ్బులు పంపిణీ చేస్తూ దొరికిపోయారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు వారిని పట్టుకుని కొట్టారు. ఆదివారం అర్ధరాత్రి హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 13లో ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి నుంచి రూ.3.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గోషామహల్ నియోజకవర్గ నాయకుడి ఆదేశాల మేరకే డబ్బులు పంచుతున్నట్లు సునీల్ పోలీసుల దర్యాప్తులో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+