టోల్ ఫ్రీ నెంబర్లను కూడ వదలని పోకిరీ, మహిళలతో అసభ్యకరంగా ...
హైదరాబాద్:మహిళల గొంతు వినబడితే చాలు ఆ వ్యక్తికి పండగే, ఫోన్లే వారిని మాటలతో వేధిస్తాడు.చివరకు టోల్ ఫ్రీ నెంబర్లను కూడ వదల్లేదు ఆ దుండగుడు.ఓ బాధితురాలు షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
హైద్రాబాద్ జీడిమెట్లలోని చెరుకుపల్లి కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్ అనే వ్యక్తి టోల్ ఫ్రీ నెంబర్లను ఎంచుకొని ఫోన్లు చేసేవాడు.
టోల్ ప్రీ నెంబర్ లో మహిళలు మాట్లాడితే చాలు వారిని తన మాటలతో వేధించేవాడు.ఫోన్ కట్ చేసినా పదే పదే ఫోన్ చేసేవాడు. అసభ్యంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేసేవాడు.

అయితే శివకుమార్ తీరుతో ఇబ్బందులకు గురైన ఓ బాధితురాలు షీ టీమ్ కు ఫిర్యాదు చేసింది.శనివారం నాడు శివకుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.
బాధితురాలు కేసు వద్దని హెచ్చరించి వదిలి వేయాలని పోలీసులకు సూచించింది.దీంతో నిందితుడిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
ఆనందం కోసమే ఇలా చేశా
శివకుమార్ వందలకొద్ది ఫోన్లు చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. బంజారాహిల్స్ కు చెందిన ఓ బాధితురాలు షీ టీమ్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.అయితే ఈ రకంగా ఫోన్లు చేసి వేధించడం వల్ల మానసిక ఆనందం కలుగుతోందని శివకుమార్ చెప్పాడు.అయితే ప్రవర్తన మార్చుకొనేవరకు వారానికి ఓ సారి రావాల్సిందేనని పోలీసులు సూచించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications