పట్టపగలే స్నేహితుడిపై కత్తితో దాడి: ఆస్పత్రిలో బాధితుడు, నిందితుడి అరెస్ట్(పిక్చర్స్)

హైదరాబాద్: ఓ వ్యక్తి తన స్నేహితుడిపై పట్టపగలే కత్తితో దాడి చేసి ఘటన శుక్రవారం నగరంలో చోటు చేసుకుంది. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు, బంధువులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. రామనగర్‌లో నివాసముంటున్న గుడేల జగదీష్(60) మద్యం వ్యాపారం చేస్తుంటారు. డాబాగార్డెన్స్ నారాయణవీధిలో ఉన్న సొంత కార్యాలయానికి శుక్రవారం ఉదయం 10.30గంటల ప్రాతంలో చేరుకున్నారు.

అప్పటికే అక్కడున్న అతని స్నేహితుడు గళ్లా పొలిపల్లి అలియాస్ చిన్నాను చూసి పలకరించారు. ఆఫీసులోకి వెళ్లి మాట్లాడుకుందామని అతనితో చెప్పారు. కాగా, వెనుక వస్తున్న చిన్నా.. తన వెంటే తెచ్చుకున్న కొబ్బరిబొండాలు నరికే కత్తితో వెనుక నుంచి జగదీష్ తలపై నరికాడు.

బాధితుడు

బాధితుడు

ఓ వ్యక్తి తన స్నేహితుడిపై పట్టపగలే కత్తితో దాడి చేసి ఘటన శుక్రవారం నగరంలో చోటు చేసుకుంది. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు, బంధువులు తెలిపారు.

బాధితుడు

బాధితుడు

వివరాల్లోకి వెళితే.. రామనగర్‌లో నివాసముంటున్న గుడేల జగదీష్(60) మద్యం వ్యాపారం చేస్తుంటారు. డాబాగార్డెన్స్ నారాయణవీధిలో ఉన్న సొంత కార్యాలయానికి శుక్రవారం ఉదయం 10.30గంటల ప్రాతంలో చేరుకున్నారు.

బాధితుడు

బాధితుడు

అప్పటికే అక్కడున్న అతని స్నేహితుడు గళ్లా పొలిపల్లి అలియాస్ చిన్నాను చూసి పలకరించారు.

బాధితుడు

బాధితుడు

ఆఫీసులోకి వెళ్లి మాట్లాడుకుందామని అతనితో చెప్పారు. కాగా, వెనుక వస్తున్న చిన్నా.. తన వెంటే తెచ్చుకున్న కొబ్బరిబొండాలు నరికే కత్తితో వెనుక నుంచి జగదీష్ తలపై నరికాడు.

పెద్దగా కేకలు వేసిన జగదీష్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఆఫీసు పైఅంతస్తులోనే నివాసముంటున్న జగదీష్ తమ్ముళ్లు వచ్చి వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి పారిపోతున్న నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతానికి జగదీష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. జగదీష్, చిన్నాలు గత 20ఏళ్లుగా మంచి స్నేహితులని బంధువులు చెబుతున్నారు. వ్యాపారాల నిమిత్తం వీరు నగదు ఇచ్చిపుచ్చుకుంటారని, అక్కడేమైనా తేడాలొచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. నిందితుడ్ని విచారించిన తర్వాత వివరాలు చెబుతామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+