హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
Hyderabad Fire accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగర శివార్లలోని ఓ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి భవనం నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
హైదరాబాద్ శివార్లలోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ సాయంత్రం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు.

మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు రక్షణ కల్పించారు. వారిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఏడు అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పివేశాయి. ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదని తెలుస్తోంది. ఎవరూ గాయపడలేదని సమాచారం. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రి యాజమాన్యం తక్షణ నివారణ చర్యలను చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యగా అంబులెన్సులను సిద్ధం చేసింది. అగ్నిమాపక శకటాలకు సకాలంలో మంటలను నియంత్రించగలిగాయి. దీనితో ప్రాణనష్టం తప్పింది.
ఈ ఘటన పట్ల అంకుర ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. షార్ట్ సర్క్యూటే ఈ ఘటనకు కారణమని తెలిపింది. టెర్రస్‌పై అమర్చిన అవుట్ డోర్ లైట్లు షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యాయని వివరించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారని, మంటలను సకాలంలో ఆర్పివేశారని పేర్కొంది.












Click it and Unblock the Notifications