కూతుర్ని కత్తితో పొడిచి కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి
నవమాసాలు కని పెంచిన బిడ్డనే కర్కశంగా కడతేర్చింది ఆ తల్లి . అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతుర్నే అత్యంత కర్కశంగా పొడిచి చంపింది. కూతురు చనిపోయాక ఆమె కూడా పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. స్థానికంగా విషాదం నింపిన ఈ సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో జరిగింది.
కొత్తకోట గ్రామానికి చెందిన నిర్మల భర్త నరసింహ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఇక అప్పటి నుండి ఆమె అరేపల్లిలోని పుట్టింట్లోనే ఉంటోంది. కాయకష్టం చేసుకుని బిడ్డను సాకుతుంది. ఈనెల 6న ఉగాది పండుగ కోసం 8 ఏళ్ళ తన కుమార్తె సింధుతో పాటు పాలెంలోని అత్తగారింటికి వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి ఆమె కుమార్తె సింధును కత్తితో పొడిచి హత్య చేసింది. కుమార్తె మరణించిన తరువాత ఆమె కూడా పురుగుమందు తాగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది .

సోమవారం తెల్లవారుజామున గుర్తించిన కుటుంబసభ్యులు కొన ఊపిరితో ఉన్న నిర్మలను చికిత్స కోసం వనపర్తి జిల్లా హస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఇవాళ ఉదయం మృతిచెందింది. కుమార్తె హత్యకు, నిర్మల ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని సీఐ వివరించారు.
అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భర్త చనిపోయాక నిర్మలకు కుటుంబపోషణ కష్టంగా మారిందని, ఆ కారణంగాకష్టాలు భరించలేకనే తన కూతురు ఎవ్వరికీ భారం కాకూడదని నిర్మల ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు గ్రామస్థులు. అయితే ఆమె పుట్టింటి నుండి అత్తగారింటికి వచ్చిన క్రమంలో ఏమైనా జరిగిందా అన్న కోణం లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications