హిమాన్షులో కొత్తకోణం.. గర్వంగా ఉందన్న కేటీఆర్ పుత్రోత్సాహం; అల్లుడ్ని మెచ్చుకున్న కవిత!!

తనలో ఉన్న మరో టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు కల్వకుంట్ల హిమాన్షు రావ్.

కెసిఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షులో ఇప్పుడు మరొక కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తన నాయకత్వ ప్రతిభతో మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం తనలో ఉన్న మరో టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. హిమాన్షు చేసిన పనితో మంత్రి కేటీఆర్ లో పుత్రోత్సాహం కనిపిస్తుంది. ఇంతకీ హిమాన్షు ఏం చేశాడంటే..

మంచి హాలీవుడ్ పాట పాడిన హిమాన్షు రావు

గోల్డెన్ అవర్ పేరుతో ఉన్న ఒక అద్భుతమైన ఇంగ్లీష్ పాటను హిమాన్షు రావ్ ఆలపించారు. చక్కనైన ఇంగ్లీష్ యాక్సెంట్ లో సంగీతం పట్ల ప్రావీణ్యం ఉన్న సింగర్ లా చాలా గొప్పగా హిమాన్షు పాట పాడారు. హిమాన్షు పాడిన పాట అచ్చం జాకబ్ లాసన్ ను తలపించేలా ఉందని పలువురు అతనిని కొనియాడుతున్నారు. ఈ పాట ఒరిజినల్ గా అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత అయిన జాకబ్ లాసన్ ఆలపించారు. అచ్చం ఆయనలానే హిమాన్షు రావ్ చాలా గొప్పగా ఈ పాటను పాడారు. ఈ పాట విన్న వారంతా కేటీఆర్ కొడుకు హిమాన్షు కు ఇంత టాలెంట్ ఉందా అని చర్చిస్తున్నారు.

కొడుకు పాట విని ఉబ్బి తబ్బిబ్బైన మంత్రి కేటీఆర్

కొడుకు పాట విని ఉబ్బి తబ్బిబ్బైన మంత్రి కేటీఆర్


తాను పాడిన పాటను హిమాన్షురావ్ "గోల్డెన్ అవర్ x హిమాన్షు కవర్" పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. దీంతో హిమాన్షు పాట ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక హిమాన్షురావు పాడిన పాటను విన్న తండ్రి కేటీఆర్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. తన కొడుకు పాట విని ఎంతగానో మురిసిపోయాడు. ఇక కొడుకు హిమాన్షు పాడిన పాటకు ఫిదా అయిన తండ్రి ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. నా కొడుకు గురించి చాలా గర్వపడుతున్నానని, అతనిలో ఉన్న టాలెంట్ చూసి ఉత్సాహంగా అనిపిస్తుందని ఆ పాటను పోస్ట్ చేశారు. నేను హిమాన్షు పాడిన పాటను బాగా ఇష్టపడ్డానని, మీరందరూ కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హిమాన్షు పాడిన పాటపై నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

అల్లుడి పాటను తెగ పొగిడేస్తున్న ఎమ్మెల్సీ కవిత

అల్లుడు హిమాన్షు పాడిన పాటపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె అల్లుడిని ప్రశంసించారు. చెవులకు శ్రావ్యమైన స్వరాన్ని వినిపించావు అల్లుడు అంటూ కొనియాడారు. హిమాన్షుని చూస్తే చాలా గర్వంగా ఉందని, భవిష్యత్తులో నువ్వు ఇంకా మరిన్ని పాటలు పాడి వాటిని వినిపించాలని కోరుకుంటున్నాను అంటూ కవిత పోస్ట్ చేశారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయని తన పోస్టులో కవిత పేర్కొన్నారు. మొత్తానికి హిమాన్షు రావ్ తన గోల్డెన్ అవర్ పాటతో అందరినీ ఫిదా చేసేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+