హైదరాబాద్ నైట్ క్లబ్‌లో వన్య ప్రాణుల కలకలం: వీడియోలు వైరల్, యజమాని అరెస్ట్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జోరా పబ్(నైట్ క్లబ్) యజమాని వినయ్ రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పబ్‌లో వన్యప్రాణులను వినయ్ రెడ్డి ప్రదర్శించిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వన్య ప్రాణులను పెట్టి పబ్ నడుపుతుండటం, వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఈ కేసులో జోరా పబ్ యజమానితోపాటు మేనేజర్ వరహాలనాయుడును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్‌కి వన్య ప్రాణులను సరఫరా చేసిన హైదరాబాద్‌ పెట్స్‌ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పబ్ ‌లోని వన్య ప్రాణులను జూకి తరలించారు.

animals

రొటీన్‌కు భిన్నంగా కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌లో అరుదైన పాములు, తొండలు, పిల్లులు, కుక్కలను పెట్టి వినయ్ రెడ్డి పబ్‌ను నడిపించడంపై పలువురు నెటిజన్లతో పాటు వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. క్లబ్బు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ చేపట్టి.. పబ్ యజమాని వినయ్ రెడ్డితో పాటు మిగతావారిని కూడా అరెస్ట్ చేశారు.

అంతకుముందు తమపై వచ్చిన ఆరోపణలకు ప్రతిస్పందనగా జోరా(Xora) యాజమాన్యం స్పందిస్తూ.. ఇక్కడ ఏ తప్పూ జరగలేదని తెలిపింది. తమ షోలలో కనిపించే జంతువులన్నీ చట్టబద్ధంగా పొందామని, వాటికి అవసరమైన లైసెన్సులు, అనుమతులు ఉన్నాయని క్లబ్ స్పష్టం చేసింది.

జంతువుల సంక్షేమం, భద్రత చాలా ముఖ్యమైనవని, ఈవెంట్‌ల సమయంలో ఎటువంటి హాని జరగలేదని హాజరైన వారికి భరోసా ఇస్తూ ఉద్ఘాటించింది. జంతువులను చాలా జాగ్రత్తగా, శ్రద్ధతో నిర్వహించామని, అవసరమైన అన్ని భద్రతా చర్యలను పాటిస్తున్నామని జోరా యాజమాన్యం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+