యజమాని ప్రైవేట్ పార్ట్స్ కొరికితిని ప్రాణం తీసిన పెంపుడుకుక్క!

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. విశ్వాసానికి ప్రతీకగా చెప్పుకునే కుక్క యజమానిని అత్యంత దారుణంగా హతమార్చింది. సహజంగా యజమాని అంటే కుక్కలు అత్యంత విశ్వాసాన్ని చూపిస్తాయి. వారికి ఏదైనా చిన్న కష్టం వస్తే కూడా అవి తెగ బాధ పడిపోతాయి. యజమానులు చనిపోయిన సందర్భాలలో కూడా మనుషుల మాదిరిగా ఏడుస్తూ యజమాని పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తున్న కుక్కలు ఎన్నో ఉన్నాయి.

యజమాని ప్రాణం తీసిన కుక్క
అటువంటి కుక్కలు కొన్ని సందర్భాలలో యజమానుల ప్రాణాలు తీస్తున్నాయి. గతంలోనూ కుక్కలు యజమానులు ప్రాణాలు తీసిన అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్లోని మధురానగర్ లో యజమాని ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఒక కుక్క అతని ప్రాణాలు తీసింది. పవన్ కుమార్ అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అతను ప్రతిరోజు తన పడుకునేటప్పుడు పెంచుకున్న పెంపుడు కుక్కను కూడా పక్కనే పడుకోబెట్టుకుంటాడు.

A pet dog that bit the owner private parts and killed in hyderabad madhuranagar

Take a Poll

మర్మాంగాలను కొరికి తిని యజమానిని చంపిన కుక్క
ఇదే క్రమంలో ఎప్పటిలానే తన పడుకునేటప్పుడు తన పెంపుడు కుక్కను కూడా పక్కనే పడుకోబెట్టుకున్న పవన్ కుమార్ పైన ఊహించని విధంగా కుక్క దాడి చేసింది. అతని మర్మాంగాలను కొరికి తిని ప్రాణం తీసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాకు చెందిన పవన్ కుమార్, తన స్నేహితుడు సందీప్ తో కలిసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గత ఐదు సంవత్సరాలుగా మధురానగర్ లో నివసిస్తున్నాడు.

అనారోగ్యంతో బాధపడుతున్న పవన్
నిన్న రాత్రి అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ ఆస్పత్రికి వెళ్లి దాదాపు 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి తన గదిలో నిద్రపోయాడు. అతని పక్కనే అతను పెంచుకుంటున్న కుక్క కూడా పడుకుంది. ఉదయం ఇంటికి వచ్చిన స్నేహితుడు ఎంతకు తలుపు తీయక పోయేసరికి చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూశాడు.

నోటి నిండా రక్తంతో పెంపుడు కుక్క
అప్పటికే పవన్ చనిపోయాడు. ఇక అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం కనిపించింది. దీంతో కుక్క అతని మర్మాంగాలను కొరికి తిన్నట్టు వారంతా గుర్తించారు. అయితే కుక్క కారణంగానే పవన్ మృతి చెందాడు. లేక మరి ఏమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+