రోడ్డుపైనే మహిళ ప్రసవం: మహిళా కానిస్టేబుళ్ల సాయం, సీపీ అభినందన

హైదరాబాద్‌: నగరంలోని నారాయణగూడ శాంతి థియేటర్‌ దగ్గర ఓ మహిళ రోడ్డుపక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పై ప్రసవించింది. వెంటనే స్పందించిన నారాయణగూడ మహిళా పోలీసులు ప్రసవం కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేసి సహకరించారు.

అనంతరం తల్లి, బిడ్డను కోటిలోని మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. ప్రసవం కోసం మహిళా పోలీసులు చూపిన చొరవను స్థానికులు అభినందించారు. ప్రసవించిన మహిళ ఓ యాచకురాలిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మహిళా పోలీసులకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.

A pregnant woman delivered a baby on road

కానిస్టేబుల్‌పై చైన్‌స్నాచర్ల దాడి

హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సరూర్‌నగర్ కానిస్టేబుల్ సమ్మయ్య బ్లాక్ కలర్ పల్సర్ బైక్‌ను చైన్‌స్నాచర్లు ఎత్తుకెళ్లారు. స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై చైన్ స్నైచర్లు దాడికి పాల్పడి బైక్‌తో పరారయ్యారు.

దొంగలను పట్టుకోవాలని కానిస్టేబుల్ కేకలు వేసినప్పటికీ అక్కడున్న జనం స్పందించకపోగా, వీడియోలు తీయడం విచారకరం. కాగా, దొంగలు తాము తెచ్చిన బైక్‌ను ఘటనా స్థలంలో వదిలి వెళ్లారు.

స్నాచర్లు పాతబస్తీకి చెందిన పాత నేరస్థులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+