తెలంగాణలోని నిలువురాళ్లకు అరుదైన గౌరవం.. యునెస్కోలో చోటు !

తెలంగాణ రాష్ట్ర ప్రఖ్యాతిలో ముడుమాల్ నిలువురాళ్లు మరో కలికితురాయిగా నిలిచాయి. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఉన్న ఈ నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. ఈ విషయాన్ని పారిస్ లోని భారత బృందానికి యునెస్కో సమాచారం అందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అందుకు సంబంధించిన ప్రెస్ నోట్ ని సైతం పంచుకున్నారు.

అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్‌లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్, పలు రాష్ట్రాల్లో నిర్మించిన అశోక శాసన ప్రదేశాలు, చౌసత్ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతదేశంలోని గుప్త దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని బుందేలాస్ రాజభవనాలు, కోటలు కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

a-rare-honor-for-the-vertical-stones-of-telangana-a-place-in-unesco

నిలువు రాళ్లు చరిత్ర..

ఈ నిలువురాళ్లను శిలాయుగానికి సంబంధించిన వాటిగా చారిత్రక పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిలువురాళ్లు ఆదిమ మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శిలాయుగంలో వాతావరణ మార్పులు, రుతువులు, కాలాలను గుర్తించడానికి ఆదిమ మానవులు ఏర్పాటు చేసుకున్నట్లుగా చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు వీటిని ఏర్పాటు చేసుకున్నట్టు వివరించారు.

ముడుమాల్ లో దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిలువు రాళ్లు ఉన్నాయి. 100 వరకు గండ శిలలు ఉండగా.. ఒక్కొక్కటి 12 నుంచి 14 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. అలానే చిన్న, చిన్న రాళ్లు మరో రెండువేల వరకు ఉంటాయి.

ఇక నిలువురాళ్లకు ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో స్థానం కల్పించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక జాబితా నుంచి శాశ్వత జాబితాలోకి కూడా వీటికి చోటు దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు. తెలంగాణలో మరెన్నో గొప్ప ఆవిష్కరణలు ఉన్నాయని అంటున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ప్రభుత్వం కూడా గుర్తింపు నోచుకోని మరెన్నో ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+