హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమ్మె: ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో గురువారం రెండో రోజూ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ప్రైవేటు ఆపరేటర్లతో నిర్వహిస్తున్న బస్సులపై సమ్మెలో ఉన్న సిబ్బంది పలుచోట్ల దాడులు చేశారు. కంటోన్మెంట్ డిపోనుంచి బస్సులు బయటకు రావడంతో హతాశుడైన ప్రభుదాస్ అనే డ్రైవర్ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు.

కాగా, ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడాయి. రెండో రోజు ప్రైవేటు వాహనాల దోపిడీ మరింత పెచ్చుమీరింది. జంట నగరాల్లో ఆటోవాలాల చార్జీలు వసూలు ఇష్ట్యారాజ్యంగా సాగింది. దూర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో కార్లు, క్యాబ్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నాలుగు రెట్ల చార్జీలు వసూలు చేశాయి. మరోవైపు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ పోస్టులకు మంచి స్పందన వస్తోంది. రెండో రోజు తెలంగాణలో 2410 మంది కండక్టర్ పోస్టులకు రాగా, 2150 మంది ఎంపిక చేశారు. 490 మంది డ్రైవర్లు రాగా, రవాణా శాఖ అధికారుల పరీక్షల అనంతరం 219 మందిని ఎంపిక చేశారు.

యాజమాన్యం హెచ్చరికలతో కొంత మంది కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లోకి వస్తున్నారు. శుక్రవారం నాటికి కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లోకి చేరే అవకాశాలున్నాయి. వారి ద్వారా మరిన్ని బస్సు సర్వీసులు నడపడానికి ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. పోలీసుల ఎస్కార్ట్ నడుమ కొన్ని డిపోల నుంచి బస్సులను ఆపరేట్ చేశారు. కంటోన్మెంట్ డిపోలో 180 బస్సులుండగా, కార్మికుల ఆందోళనల మధ్య 22 బస్సులు రోడ్డెక్కాయి.

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు హైదరాబాద్ కాచిగూడ నుంచి నుంచి నిజామాబాద్, కాజీపేటకు ప్రత్యేక రైళ్లు నడిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా మార్గాల్లో డెము, మెము ప్రత్యేక రైళ్లు నడిపినట్లు సిపిఆర్వో ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో గురువారం రెండో రోజూ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ప్రైవేటు ఆపరేటర్లతో నిర్వహిస్తున్న బస్సులపై సమ్మెలో ఉన్న సిబ్బంది పలుచోట్ల దాడులు చేశారు.

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

కంటోన్మెంట్ డిపోనుంచి బస్సులు బయటకు రావడంతో హతాశుడైన ప్రభుదాస్ అనే డ్రైవర్ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

వెంటనే పోలీసులు ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్‌ను అడ్డుకున్నారు.

English summary
A rtc driver attempted to commit suicide in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X