Crime News: ఆన్‍లైన్ రూ.10 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఇంట్లో నుంచి అదృశ్యం..
ఈ మధ్య ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. అమాయకులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆన్ లైన్ లో రూ.10 లక్షలు పెట్టి మోసపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించారు. కుటుంబ సభ్యుల మందలింపుతో మనస్తాపం చెంది అతను కనబడకుండా పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది..
సాయిపవన్
అమీన్‌పూర్ పరిధి కేఎస్‌ఆర్ కాలనీకి చెందిన సాయిపవన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.అతను ఇటివలో ఆన్ లైన్ వచ్చిన ఓ ప్రకటన చూశాడు. దీంతో ఆన్‌లైన్‌లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత నష్టపోయానని తెలుసుకున్నాడు. రూ.10 లక్షలు కావడంతో ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. రూ.10 లక్షలు పోగోట్టవా అని కుటుంబ సభ్యులు మందలించారు.

రూ.10 లక్షలు
రూ.10 లక్షలు పోయిన బాధతో పాటు కుటుంబ సభ్యులు మందలించారనే మనస్తాపంతో సాయిపవన్ 14 తేదీ అంటే సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అతని కోసం కుటుంబ సభ్యులు వెతికారు. సాయిపవన్ స్నేహితులు, బంధువులకు ఫోన్ చేశారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయిపవన్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications