దీపావళి తర్వాత పురుషులు ఆడే స్పెషల్ బతుకమ్మ; ప్రత్యేకతలివే!!

తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ పండుగను దసరాకి ముందు ఘనంగా జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం బతుకమ్మ పండుగను దీపావళి తర్వాత జరుపుకుంటారు. ముఖ్యంగా పురుషులు, మహిళలతో కలిసి బతుకమ్మలాడుతూ వేడుకలు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో చాలా విభిన్న రీతిలో దీపావళి తర్వాత జరిగే బతుకమ్మ వేడుకలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.

నేతకాని బతుకమ్మ వేడుకలు
అసలు ఈ బతుకమ్మ వేడుకలు ఎక్కడ జరుగుతాయి? ఎందుకు ఈ సమయంలో జరుపుకుంటారు? అనే విషయానికి వస్తే హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామస్తులు దీపావళి పండుగ రోజుల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఈ గ్రామంలో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం మూడు రోజులపాటు జరిగే ఈ బతుకమ్మ వేడుకలను సీతంపేట గ్రామంలోని నేతకాని కులస్తులు నిర్వహిస్తారు.

A special bathukamma played by men after Diwali in telangana

మూడు రోజుల వేడుకలు ఇలా
ఇక ఈ బతుకమ్మ వేడుకలలో భాగంగా నవంబర్ 1వ తేదీన శుక్రవారం మొదటి రోజు నేతకాని కులస్తులంతా చెరువు వద్దకు వెళ్లి రేగడి మట్టి తెచ్చి జోడెద్దుల ప్రతిమలను తయారు చేశారు. ఆ ప్రతిమలను గారెలతో అందంగా అలంకరించి కేదారేశ్వరుడికి పురుషులంతా పూజలు నిర్వహించారు. ఇక నిన్న మొదటి రోజు తయారు చేసి పూజించిన జోడెద్దుల ప్రతిమలను ఊరేగింపుగా తీసుకువెళ్లి సమీపంలో ఉన్న చెరువులలో నిమజ్జనం చేశారు.

అట్టహాసంగా నేడు బతుకమ్మ
ఇక ఈ ఉత్సవాలలో పిండి వంటలను పురుషులు వాయినంగా ఇచ్చి పుచ్చుకుంటారు. సాంప్రదాయ నృత్యాలతో, కోలాటాలతో రెండవ రోజు ఎడ్ల పండుగను ఘనంగా చేశారు. ఇక నేడు మూడవ రోజు సాయంత్రం బతుకమ్మను పేర్చి ఊరు ఊరంతా సందడిగా బతుకమ్మ ఆటలు ఆడడానికి చెరువు వద్దకు చేరుతుంది. కోలాటాలు ఆడుతూ బాణాసంచా కాల్చి, నృత్యాలు చేస్తూ బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకువెళ్లి బతుకమ్మ ఆటలు ఆడతారు.

దీపావళి తర్వాత ఈ వేడుకల వెనుక
మహిళలతో కలిసి మగవాళ్ళు కూడా బతుకమ్మలు ఆడడం ఇక్కడ చాలా విశేషంగా కనిపిస్తుంది. దీపావళి పండుగ తర్వాత నిర్వహించే ఈ వేడుక తమ గ్రామమంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అనాదిగా నిర్వహిస్తున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఈ వేడుకలు చేస్తామని చెబుతున్నారు.

నేతగాని కులస్థుల బతుకమ్మ ఆచారానికి రీజన్ ఇదే
నేతకాని కులస్తులకు ఈ ఆచారాన్ని కొనసాగించడం వెనుక ఒక కారణం ఉందని చెబుతున్నారు. గతంలో అందరు గ్రామస్థులతో పాటు నేతకాని కులస్తులు బతుకమ్మ ఆడేందుకు వెళితే వారితో ఆడడానికి గ్రామస్తులు నిరాకరించేవారట. దీంతో వారు ప్రత్యేకంగా బతుకమ్మను చేసుకోవాలని నిర్ణయించుకుని దీపావళి తర్వాత బతుకమ్మ సంబరాలకు మూడురోజులు కేటాయించాలని నిర్ణయించారట. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు నేతకాని కులస్తులు ప్రతి సంవత్సరం దీపావళి పండుగ తర్వాత బతుకమ్మ ఉత్సవాలను సాగిస్తున్నారు.

నేడు సాయంత్రం బతుకమ్మ
ఇక నేడు సాయంత్రం అట్టహాసంగా బతుకమ్మ ఆటలు ఆడి నిమజ్జనం చేయడంతో నేతగాని బతుకమ్మ పండుగ పరిసమాప్తమవుతుంది. రాష్ట్రంలో మరి ఎక్కడ జరగని విధంగా ఇక్కడ జరిగే బతుకమ్మ వేడుకలను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తారు. ఈ మూడు రోజుల నేతకాని బతుకమ్మ దీపావళి తర్వాత జరిగే స్పెషల్ వేడుక.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+