హిట్ అండ్ రన్: కారుతో ఢీకొట్టడంతో ఆర్ఎస్ఐ మృతి, పట్టించుకోని జనం

Subscribe to Oneindia Telugu
  కారుతో ఢీకొట్టడంతో ఆర్ఎస్ఐ మృతి, పట్టించుకోని జనం video | Oneindia Telugu

  హైదరాబాద్: నగరంలో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొట్టిన ఘటనలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ దుర్మరణ చెందారు. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

  ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏదో పనిమీద ట్రాఫిక్ ఆర్ఎస్ఐ లక్ష్మణ్ తన బైకు మీద గురువారం రాత్రి బయటకు వెళ్లారు. ఓల్డ్ కాప్రాలో తన వాహనంపై వెళ్తుండగా.. వెనుకనుంచి దూసుకొచ్చిన కారు అతడ్ని బలంగా ఢీకొట్టింది.

  A traffic rsi dies in a road accident in medchal on Thursday night.

  కాగా, ప్రమాదం జరిగిన తర్వాత కనీసం ఆ వ్యక్తి ఎవరు, గాయాలేమైనా అయ్యాయా? అని కూడా చూడకుండా కారులోని గుర్తుతెలియని వ్యక్తులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత చాలా మంది అటుగా వెళ్లారు కానీ, అతడ్ని ఆస్పత్రిలో చేర్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరం.

  ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన లక్ష్మణ్.. బ్రెయిడ్ డెడ్ కావడంతో మృతిచెందారు.

  కాగా, లక్ష్మణ్ అవయవాలను కుటుంబసభ్యుల అనుమతితో దానం చేశారు. లక్ష్మణ్ మియాపూర్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణమైన కారు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A traffic rsi dies in a road accident in medchal on Thursday night.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి