Viral Video: అల్కహాల్‍తో హల్దీ ఫంక్షన్.. వైరల్ అవుతున్న వీడియో..
ప్రతి మనిషి జీవితంలో పెళ్లి ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. అందుకే పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకుంటారు. ఈ క్రమంలో పెళ్లి పత్రికలు వెరైటీగా అచ్చు వేయించడం. పెళ్లి ఊరేగింపు కొత్తగా చేయడం, పెళ్లే విచిత్రంగా చేసుకోవడం వంటి చేస్తుంటారు. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంటాయి.
తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా హల్దీ ఫంక్షన్ వెరైటీగా నిర్విహించారు. ఇందుకు సంబంంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని తాడుర్ మండలం ఐతోల్ గ్రామంలో ఓ పెళ్లికి ముందు హల్దీ నిర్వహించారు. అయితే అత్యంత పవిత్రంగా గౌరవప్రదంగా జరగాల్సిన పెళ్లి తంతు బీరుతో హల్దీ ఫంక్షన్ (మంగళ స్నానాలు) నిర్వహించడంతో వివాదానికి దారితీస్తోంది.

వేదమంత్రాలతో రెండు కుటుంబాలను రెండు మనసులను ఏకం చేస్తూ నూరేళ్ల జీవితానికి వేదిక అయ్యే ఈ పెళ్లి కార్యక్రమం రోజురోజుకు కొత్త పోకడలకు దారితీస్తోందని పలువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్ల నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
నాగర్ కర్నూల్: వివాహ వేడుకలో బీర్ తో హల్దీ వేడుక pic.twitter.com/xCqxAsg8ws
— oneindiatelugu (@oneindiatelugu) May 21, 2023
ఈ వీడియోపై కొందరు బీర్ కింద పోయడం ఎందుకు తాగొచ్చ కాదా.. మరికొందరు ఏంటీ పని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎండకాలం బీర్ తో స్నానం చేయిస్తే చల్లగుంటదని మరొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications