Viral Video: మానవత్వ మా నీ జాడెక్కడా.. సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్..
సమాజంలో చాలా మంది వృద్ధులు కష్టాలు పడుతున్నారు. వారి పిల్లలు వారిని సరిగా చూసుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది పిల్లలు అయితే తమ తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలో గతంలో చాలానే జరిగాయి. అత్తమామను సరిగా చూసుకోకుండా ఇబ్బంది పెట్ట కోడళ్లు ఉన్నారు. కన్నవారిని సరిగా చూసుకోని కొడుకులు, కుమార్తెలు ఉన్నారు. అయితే వారు కూడా కొద్ది రోజుల తర్వాత అదే స్థితికి చేరుతారని గమనించలేక పోతున్నారు.
చివరికి తాము కూడా వృద్ధాప్యంలోకి వెళ్తామని గుర్తించ లేకపోతున్నారు. మానవత్వాన్ని మరిచిపోతున్నారు. తాజాగా ఓ కోడలు వృద్ధుడైన మామపై విచక్షణారహితంగా దాడి చేసింది. వీల్ చైర్ ఉన్న వృద్ధుడి చెప్పుతో కొట్టింది. అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో కోడలు మామను కొడుతున్న దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్టు చేశారు. "మానవత్వమా.. నీ జాడెక్కడ!! మూగ జీవులకు ఉన్న మానవత్వం కూడా మనిషికి లేదా..? ఎటు పోతోందీ సమాజం? ఇలాంటి సమాజంలో మనుగడ సాగిస్తున్నామా.. అని తలుచుకుంటేనే బాధేస్తోంది" అని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో జరిగింది. వృద్ధుడైన మామపై అతడి కోడలు విచక్షణారహితంగా కొట్టింది. మామ వీల్ చైర్ లో లేవలేని పరిస్థితులో ఉన్నా ఆ కోడలు కనికరించలేదు. మామ ముఖంపై పదే పదే చెప్పుతో కొట్టింది. తనను కొట్టవద్దంటూ మామ కోడలి కాళ్లు పట్టుకున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కోడలు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలంటున్నారు.
సజ్జనార్ గతంలో కూడా ట్వీట్లు చేశారు. " కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే హృదయవిదారక సంఘటన! హృదయం కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్న హేయమైన ఘటన ఇది. మాయమవుతున్న మనిషితత్వానికి మాయని మచ్చ ఇది" అంటూ ఓ వృద్ధ దంపతుల గురించి ట్వీట్ చేశాడు.
మానవత్వమా.. నీ జాడెక్కడ!!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 8, 2024
మూగ జీవులకు ఉన్న మానవత్వం కూడా మనిషికి లేదా..? ఎటు పోతోందీ సమాజం?
ఇలాంటి సమాజంలో మనుగడ సాగిస్తున్నామా.. అని తలుచుకుంటేనే బాధేస్తోంది. #HumanityFirst pic.twitter.com/zfwhuYzZsb












Click it and Unblock the Notifications