కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు.. బండి సంజయ్ టీమ్ కు అన్నీ మంచి శకునములే!!

కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు బీజేపీకి మరో అవకాశం ఇచ్చింది. ఇది బీజేపీకి కొత్త ఊపునిచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తుంది. నువ్వా నేనా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఉంది మేమేనని చెప్పాలని చాలాకాలంగా బిజెపి, కాంగ్రెస్ లు పోటీ పడుతున్నాయి. కానీ స్వయంకృత అపరాధాలతో కాంగ్రెస్ దెబ్బ తింటూ ఉండగా బండి సేన దూసుకుపోతుంది.

బీజేపీ చేతికి కాంగ్రెస్ ఇచ్చిన ఆయుధం

బీజేపీ చేతికి కాంగ్రెస్ ఇచ్చిన ఆయుధం


ఇప్పటికే ఈ పోటీలో బిజెపి ముందుకు దూసుకుపోయి తెలంగాణలో కాస్త పట్టున్న పార్టీగా ప్రజలకు కనిపిస్తుంది. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో, గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ లు కూడా కోల్పోయిన పరిస్థితి అందుకు కారణం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు ఆ పార్టీని నాశనం చేస్తుంటే బీజేపీ పక్కా ప్లాన్ తో దూసుకుపోతుంది. ఇక ఇదే సమయంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఆయుధం బిజెపి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి మరో అవకాశం ఇచ్చింది.

తెలంగాణాలో పట్టు కోసం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ .. పోటాపోటీగా

తెలంగాణాలో పట్టు కోసం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ .. పోటాపోటీగా


వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇప్పటినుంచే ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న కాంగ్రెస్, బిజెపి నేతలు, ఒకపక్క బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే మరోపక్క తామే ప్రత్యామ్నాయమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్రలతో, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బిజెపి నేతలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లతో రాష్ట్రంలో రచ్చ చేస్తున్నారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో బీజేపీకి బూస్ట్

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో బీజేపీకి బూస్ట్


ఇక ఇదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదు అంటూ, వచ్చే ఎన్నికలలో ఎవరికి సరైన మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడుతుందని చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తే, బిజెపికి వ్యాఖ్యలు మరింత బూస్ట్ ఇచ్చాయి. మీరిలా మాట్లాడితే మాకే కదా లాభం అన్నట్టు బీజేపీలో ఉత్సాహం కనిపిస్తుంది. ఇక బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఇచ్చిన ఆయుధాన్ని వాడటంలో తమ టాలెంట్ చూపిస్తున్నారు.

టార్గెట్ చేసిన బండి సంజయ్

టార్గెట్ చేసిన బండి సంజయ్


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయని, ఎన్నికల సమయానికి ఇరు పార్టీలు కలవడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్నికల వరకు తన్నుకొని చివర్లో మాత్రం కలిసి పోటీ చేస్తాయంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన ఆ పార్టీ నేతలే ఆ విషయం చెబుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యల పైన మాట్లాడారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ బిజెపి మాత్రమేనని తన వ్యాఖ్యల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు బండి సంజయ్.

 బండి టీమ్ కు భలే కలిసొస్తుందిగా ..

బండి టీమ్ కు భలే కలిసొస్తుందిగా ..


అసలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోల్పోయి పోరాటం చేస్తుంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు, బిజెపి నాయకులకు ఆయుధంగా మారి కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు బండి సంజయ్ టీమ్ కు అన్నీ మంచి శకునములే అన్నట్టు అంతా బాగానే కలిసి వస్తుంది. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడానికి వెతుక్కునే పని లేకుండా, వారే కావలసిన వెపన్స్ ను బండి టీమ్ కు అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+