హైదరాబాద్ మెట్రోలో యువతి సూపర్ డ్యాన్స్: వీడియో వైరల్, అధికారుల సీరియస్(వీడియో)
హైదరాబాద్: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లో ఓ యువతి డ్యాన్స్ చేస్తూ షార్ట్, ఇన్ స్టా వీడియోస్ చేసింది. ఫ్లాష్ మాబ్ తరహాలో ఆ యువతి ఒక్కరే మెట్రో స్టేషన్లో చిందులేస్తూ హల్‌చల్ చేసింది. ఓసారి మెట్రో స్టేషన్లో.. మరోసారి మెట్రో రైల్లోనూ డ్యాన్స్ చేసింది. దీంతో మెట్రో అధికారులు ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. ప్రయాణికులకు ఇబ్బంది ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు.

రా.. రా.. రక్కమా అంటూ యువతి డ్యాన్స్
హీరో సుదీప్ నటించిన విక్రాంత్ రోణ చిత్రంలో రా.. రా.. రక్కమా అనే పాటకు ఆ యువతి హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్లో రీల్ చేసింది. తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, ఆ వీడియో పట్ల చేయడం పట్ల మెట్రో అధికారులు సీరియస్ అయ్యారు. అయినా ఆ యువతి మాత్రం లెక్కచేయడం లేదు.

మెట్రో రైల్లోనూ చిందులేసిన యువతి
ఆ తర్వాత కూడా మెట్రో రైల్లోనూ మరో పాటకు చిందులేసింది ఆ యువతి. హీరో నాని, నజ్రియా నటించిన సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికులకు ఇబ్బందికలిగించేలా ఇలా వీడియోలు చేయడంపై నెటిజన్లు కూడా ఫైరవుతున్నారు. ఇలాంటి న్యూసెన్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మెట్రోలో చిందేసిన యువతిపై అధికారులు సీరియస్
ఈ నేపథ్యంలో యువతి చిందులేసిన వ్యవహారంపై మెట్రో అధికారులు సీరియస్ అయ్యారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లోనే ఆ యువతి షార్ట్ వీడియోలు చేసినట్లు గుర్తించారు. యువతిని గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించబోమని అన్నారు. మెట్రో స్టేషన్లలో ఫ్రాంక్ వీడియోలు, రీల్స్, స్కిట్లు చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఆ యువతిపై అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు కొందరు ప్రయాణికులు.












Click it and Unblock the Notifications