హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. కోట్ల అవినీతి: నిమ్స్ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసిబి దాడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రికోసం చేపట్టిన ఆధునిక పరికరాల కొనుగోళ్లలో మూడు కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందంటూ వచ్చిన అభియోగాలపై స్పందించిన అవినీతి నిరోధక శాఖ.. నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మ రక్షక్‌తోపాటు మరో ఇద్దరు అధికారుల ఇళ్ళపై దాడులు జరిపింది.

2013లో టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీతో సంబంధం లేకుండా ఆస్పత్రి కోసం వెంటిలేటర్లు, బెడ్స్, లైట్లు కొనుగోలు చేశారని, సదరు కొనుగోళ్లలో మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్, అదనపు మెడికల్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి, ఫైనాన్షియల్ కంట్రోలర్ వి శ్రీధర్ అవినీతికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ధర్మరక్షక్ ఇంట్లో ఎసిబి డిఎస్పీ రవికుమార్ నేతృత్వంలోని బృందం తనిఖీ చేసింది.

9.40లక్షల రూపాయల నగదు, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ముకుందరెడ్డి ఇంటిని కూడా సోదా చేసి ఆస్పత్రిలో ఆపరేషన్ టేబుళ్లు, ఫర్నిచర్ కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, మార్కెట్‌లో కంటే అధిక ధరలకు సామగ్రి కొనుగోలు చేశారనే అభియోగాలపై అశోక్‌నగర్‌లోని శ్రీధర్ ఇంట్లో కూడా ఏసిబి డిఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో అధికారులు సోదాలు జరిపారు. ధర్మరక్షక్, ముకుందరెడ్డి, శ్రీధర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ తెలిపారు.

ఇది ఇలా ఉండగా, నిమ్స్ ఆస్పత్రి ఫర్నిచర్ కొనుగోళ్లలో అక్రమాలు జరుగలేదని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ధర్మరక్షక్ అన్నారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ నిర్ణయం మేరకే కొనుగోళ్లు జరిగాయని, అప్పటి ప్రభుత్వం ఒత్తిడి మేరకే 3కోట్ల రూపాయల మేరకు టెండర్లను ఆహ్వానించి పరికరాలు కొనుగోలు చేశామని చెప్పారు.

ధర్మరక్షక్ నివాసంలో ఏసిబి దాడి

ధర్మరక్షక్ నివాసంలో ఏసిబి దాడి

హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రికోసం చేపట్టిన ఆధునిక పరికరాల కొనుగోళ్లలో మూడు కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందంటూ వచ్చిన అభియోగాలపై స్పందించిన అవినీతి నిరోధక శాఖ.. నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మ రక్షక్‌తోపాటు మరో ఇద్దరు అధికారుల ఇళ్ళపై దాడులు జరిపింది.

ఏసిబి దాడి

ఏసిబి దాడి

2013లో టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీతో సంబంధం లేకుండా ఆస్పత్రి కోసం వెంటిలేటర్లు, బెడ్స్, లైట్లు కొనుగోలు చేశారని, సదరు కొనుగోళ్లలో మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్, అదనపు మెడికల్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి, ఫైనాన్షియల్ కంట్రోలర్ వి శ్రీధర్ అవినీతికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.

ఏసిబి దాడి

ఏసిబి దాడి

జూబ్లీహిల్స్‌లోని ధర్మరక్షక్ ఇంట్లో ఎసిబి డిఎస్పీ రవికుమార్ నేతృత్వంలోని బృందం తనిఖీ చేసింది.

ఏసిబి దాడి

ఏసిబి దాడి

9.40లక్షల రూపాయల నగదు, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఏసిబి దాడి

ఏసిబి దాడి

అదేవిధంగా ముకుందరెడ్డి ఇంటిని కూడా సోదా చేసి ఆస్పత్రిలో ఆపరేషన్ టేబుళ్లు, ఫర్నిచర్ కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

శ్రీధర్

శ్రీధర్

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, మార్కెట్‌లో కంటే అధిక ధరలకు సామగ్రి కొనుగోలు చేశారనే అభియోగాలపై అశోక్‌నగర్‌లోని శ్రీధర్ ఇంట్లో కూడా ఏసిబి డిఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో అధికారులు సోదాలు జరిపారు.

English summary
The anti-corruption bureau of Telangana police today said its probe had found that a former director of the state-run Nizam's Institute of Medical Sciences (NIMS) here and others caused a loss Rs 3 crore by purchasing overpriced equipment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X