బూతులతో రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు (వీడియో)

నాగర్‌కర్నూల్: అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు సమస్యలు ప్రస్తావించిన ఓ వ్యక్తిపై బూతులతో రెచ్చిపోయారు. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి ప్రశ్నించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన బాలరాజు.. బూతులతో ఆ వ్యక్తిపై విరుచుకుపడ్డారు.

'నీది ఏ పార్టీ? దెం... ఇక్కడ్నుంచి. చల్ హట్. నడుబే.. వాడ్ని పంపియ్యండి. యూజ్ లెస్ ఫెల్లో' అంటూ సదరు వ్యక్తిపై అనుచిత పదజాలాన్ని ఉపయోగించి దూషించారు గువ్వల బాలరాజు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో బాలరాజు వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రశ్నిస్తూ బూతులు తిడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Achampet brs mla candidate guvvala balaraju abuses a person for questioning him

ఎమ్మెల్యేగా ఉండి సావధానంగా సమాధానం చెప్పాల్సింది పోయి.. ఇలా దూషించడం సరికాదని అంటున్నారు. కాగా, ఇటీవల గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని బాలరాజు ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ మాత్రం తమ కార్యకర్తలపైనే దాడులు చేశారంటూ మండిపడింది.

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బాలరాజు

మరోవైపు, ఎన్నికల ప్రచారంలో గువ్వల బాలరాజు దూసుకెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నాం మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లింగాల మండల పరిధిలోని కొత్తకుంటపల్లి, మగ్దూంపూర్, సురాపూర్ గ్రామాలలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు.

పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని, రాష్ట్ర ప్రజలకు సంక్షేమమైన పాలనను అందిస్తూ వారికి తోడుగా నిలుస్తున్నామన్నారు. మరోసారి మీ ఓటుతో ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని గువ్వల బాలరాజు ఓటర్లను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+